Wednesday, June 11, 2025

తొలకరి వాన జల్లులు

అంశం: *మట్టి పరిమళం*
శీర్షిక: తొలకరి వాన జల్లులు

గ్రీష్మ ఋతువు జ్యేష్ట పౌర్ణమి మృగశిర కార్తెలో ఉరుములు మెరుపులతో...

తొలకరి వానలకు పుడమి తల్లి పులకరించ కమ్మని మట్టి పరిమళాలతో...

పిల్లలు కర్రలకు కప్పలను కట్టి మోసుకుంటూ నీటిని పోస్తూ....

"వర్షాలు పడాలి వాన దేవుడా మా చెరువులు నిండాలి వాన దేవుడా"...

"మా పంటలు పండాలి వాన దేవుడా" అంటూ కేరింతలు కొడుతారు...

ఇక సందళ్లే సందళ్ళు ప్రతి ఇంటా పచ్చదనపు మామిడి తోరణాలతో...

నాగళ్ళు సరిచేసుకుని దున్నుతారు పొలాలు చెలుకలు తొలకరి *వాన జల్లుల* తో...

చెరువులు నిండి మత్తళ్ళు పడి నీరు పరవళ్ళు తొక్కు...

మడులు కట్టి నారును పెంచి పొలములలో నాటెదరు...

పచ్చని పొలాలతో  ప్రకృతి సోయగాలు పరవసించి పోవు సుందర మనోహరముగా...

పచ్చని పొలాలల్లో కలుపులు తీసి ఎరువులు చల్లి పంటలు పండించెదరు...

పంట చేతికి వచ్చిన సంతోషంలో పొలం పనుల అలసట మరిచిపోతారు...

నూతన ధాన్యంతో ఇంటింటా పిండి వంటలు చేస్తారు ఆడవాళ్ళు...

కొత్త పంటలతో రైతులు పరిమళ కావ్యాన్ని పండించినంతగా ఆనందిస్తారు ఆస్వాదిస్తారు...

No comments: