అంశం: నిజాయితీ
శీర్షిక: నీతి నిజాయతే నిత్యం శోభిస్తుంది
నిజం మాట్లాడటం నిజాయితీ
మోసం చేయకుండా ఉండటం నిజాయితీ
విశ్వాసనీయంగా ఉండటం నిజాయితీ
నైతిక విలువలతో జీవించడం నిజాయితీ!
నిజాయితీ నిప్పులాంటిది
అందుకే జనులు నిజాయితీకి భీతిచెందేరు
నిజాయితీ అవినీతికి శత్రువు
వెల కట్టలేనిది అమూల్యమైనది నిజాయితీ
సత్యం ధర్మంతో కూడినది నిజాయితీ
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం
మోసం అవినీతికి పాల్పడక పోవడం
అబద్ధాలు మాట్లాడకుండా ఉండటం
ఆశ్రిత పక్షపాతం చూపక పోవడం
రాజుగా ఉంటూ నిష్పక్షపాతంగా
వ్యవహరించడం నిజాయితీ!
త్రేతాయుగం నిజాయితీ కాలానికి ప్రతీక
కలియుగం అవినీతి కాలానికి ప్రతిబింబం
ద్వాపరయుగం నిజాయితీ అవినీతికి ఆదర్శం!
తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి
అడవులకేగిన శ్రీరాముడు
విశ్వామిత్రుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి
సర్వ సంపదలను కోల్పోయి భార్యాపిల్లల
అమ్మి వేసి కాటి కాపరి అయిన
సత్య హరిశ్చంద్రుడు
దాన ధర్మాలు చేస్తూ ధర్మ పాలన చేస్తూ
జూదంలో సర్వస్వాన్ని కోల్పోయి
నిజాయితీగా అడవులకేగిన నలమహారాజు
దేశాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దిన
జయప్రకాష్ నారాయణ్
దేశ ప్రధానమంత్రిగా సేవలందించిన
మొరార్జీ దేశాయ్ , వి.పి. సింగ్ లు
పేద తనంలో జన్మించినా
శాస్త్ర వేత్త గానూ రాష్ట్ర పతి గానూ
సేవలందించిన డా. అబ్దుల్ కలామ్
మొదలగు వారు నీతి నిజాయితీకి
నిలువుటెత్తు అద్దాలు
నిజాయితీగా మెలిగే వారికి గౌరవమర్యాదలు
అపారంగా దక్కుతాయి
నిజాయితీగా నడుచుకును వారు
సూర్యచంద్రుల వలె నిత్యం శోభిస్తారు
నిజాయితీగా జీవించే వారికి కీర్తిప్రతిష్టలు
మెండుగా ఉంటాయి!
నిజంగా అవినీతి పరులకే శిక్షలు
పడుతున్నాయంటే లేదనే చెప్పాలి
నిప్పు నిలకడగా అంటుకుని జ్వాలలా
ప్రకాశించు నట్లే
నిజాయితీ నిలకడగా అలవడినా
విలువ గౌరవం మనిషిని అందలమెక్కిస్తుంది
సూర్యచంద్రులకు వలె నీతి నిజాయితీ పరులకే
విలువ మర్యాద గౌరవం గుర్తింపు స్థిరం!
No comments:
Post a Comment