Saturday, June 14, 2025

ఆకాశంలో పున్నమి చంద్రుడు

*నేటి అంశం*ఎదలో సవ్వడి*


శీర్షిక: *ఆకాశంలో పున్నమి చంద్రుడు*

మల్లె పందిరి నీడలోన పవళించి ఉన్నా
నా బిగి కౌగిలిలో సేద తీర రావా
నా మది లోగిలిలో కొలువుండ రావా
పరవశాల ముచ్చట్లు నిత్యం వినిపించరావా!

నా *ఎదలో సవ్వడి* వినిపించట్లేదా
తేనే లాంటి నా కనులలో కరిగి పోవా
స్వాతి ముత్యంలా నాలో ఒదిగి పోవా
అదిరిన నా బుగ్గలపై ముద్దు పెట్ట రావా!

చెదిరిన నా పైటను నా పైన కప్పి పోవా
నా ప్రేమామృతాన్ని సర్రున జుర్రుకొన రావా
నా మమతల కోవెలలో నిలిచిపోవా
అలసి సొలసిన నా సొగసులకు వింజామరై పోవా!

పట్టు పరుపులపై  సేద తీర వేణు గానమై రావా
ఆనంద రాగాలతో లతలా నన్ను అల్లుకు పోవా
తెలతెల్ల వార బోతుంది కూడి కూయ బోతుంది
తెల్లని మల్లియలు అలిగి పరున్నవి!

ఆకాశంలో పున్నమి చంద్రుడు
పిండి వెన్నెలను కురుపిస్తున్నాడు
చకోర పక్షిలా నేను ఎదురు చూస్తున్నా
కృష్ణా! కాలం వయసు మరల తిరిగి రావు
నా ఎద పొంగులను చల్లార్చను రావా! 

No comments: