Wednesday, June 11, 2025

భారతీయ చిహ్నం

అంశం: చిత్ర కవిత

శీర్షిక: *భారతీయ చిహ్నం*
ప్రక్రియ: వచన కవిత

భారత జాతీయ చిహ్నం 
నాలుగు సింహాల సుందర స్వప్నం 
కనపడే సింహాలు మూడే అయినా
కనపడని నాలుగో సింహం పోలీసు!

సారనాధ్ లోని అశోకుడు స్థాపించిన స్తూపం
కుడి వైపు వృషభం ఎడమవైపు అశ్వం
క్రింద తలక్రిందులుగా ఉన్న కలువపుష్పం
మధ్యలో అశోక ధర్మ చక్రం!

ఇదియే మన భారత జాతీయ చిహ్నం
నాలుగు ఏసియా సింహాలు
ధైర్యం న్యాయం ధర్మం రక్షణకు ప్రతీకలు
శక్తి ధైర్యం విశ్వాసం అహాంకారానికి
ప్రతి రూపాలని కూడా చెబుతారు!

వృషభం కష్టపడు శక్తి గలదనీ
అశ్వం వేగానికి చురుకుదనానికి ప్రతీకగా
ధర్మ చక్రం లోని ఇరువది నాలుగు ఆకులు
సత్యం న్యాయం ధర్మం క్రమశిక్షణ మరెన్నో
లక్షణాలతో కూడిన చక్రమే *ధర్మచక్రం*!

దేవనాగరి లిపిలో లిఖించబడిన
*సత్యమేవ జయతే* అనునది
ఎప్పటికీ సత్యమే విజయం సాధిస్తుందని
అందులోని మూలసూత్రం!

నాటి నుండి నేటి వరకు భారత ప్రభుత్వం
అధికార పత్రాలపై లెటర్ హెడ్స్ పై
అధికార పథకాలపై కరెన్సీ నోట్లపై
ధృవ పత్రాలపై పాస్ పోర్ట్ బుక్కులపై
భారత జాతీయ చిహ్నంగా ముద్రిస్తుంది! 

No comments: