అంశం: అభిమానం - ఆరాధన
శీర్షిక: *అభిమానం కంటే మెరుగైనది ఆరాధన*
పెద్దలంటే మర్యాద గౌరవం ఉంటుంది
తల్లిదండ్రులంటే ప్రేమ గౌరవం ఉంటుంది
గురువులంటే బయం గౌరవం ఉంటుంది
దేవుళ్ళంటే భక్తి భయం వినయం ఉంటుంది!
కళాకారులలో గురువులలో స్నేహితులలో
కళాత్మకత నైపుణ్యం సత్ప్రవర్తన మేధస్సు
మంచి సుగుణాలు ప్రేమ తత్వం కలిగి ఉంటే
వారిపై అభిమానం పెరుగుతుంది!
చూడటానికి దగ్గరి భావాలు అనిపించినా
మర్యాద గౌరవం ప్రేమ భక్తి భయం వేరు వేరు
అలానే అభిమానం వేరు ఆరాధన వేరు
అభిమానులపై అధిక ఇష్టత ఉన్నట్లయితే
వారిపైన ఆరాధన భావం పెరుగుతుంది!
సినీ కళాకారడైన చిరంజీవి అంటే
అభిమానించే వారు కోట్లాదిమంది ఉన్నారు
అతడంటే ఆరాధించే వారు లక్షల్లో ఉన్నారు
ఏమైనా చేసుకునే వారు పదుల్లో ఉంటారు
అభిమానం కంటే గొప్ప నైనది ఆరాధన!
No comments:
Post a Comment