Tuesday, June 17, 2025

కాగితం పడవలు గేయాలు

అంశం: కాగితం పడవలు

శీర్షిక: రంగు రంగుల పడవలు
ప్రక్రియ: గేయాలు

అద్భుతం కాగితం పడవలు
అవి వర్షాకాలంలో ఆటలు
పెద్దలు చేసిస్తారు పడవలు
కేరింతలు కొడుతారు పిల్లలు!

రంగు రంగుల పడవలు
రకరకాల సైజులలో పడవలు
కొలువు దీరు కాలువల్లో పడవలు
పరుగులు తీస్తాయి పడవలు!
పడవల వలెనే మనుషుల జీవితాలు
అవనిపైన మనుషుల జీవితాలు
పేదధనిక రంగుల అహపు జీవితాలు
ఆహార్యాలతో మురిసే జీవితాలు!

కాగితం పడవల వలెనే జీవితాలు
నీటి మీద పడవలు జీవితాలు
ఎంతకాలం ఉంటాయో పడవలు
అంత కాలమే మనుషుల ప్రాణాలు!

రెప్ప పాటులో మనిషి జననం
రెప్ప పాటులో మనిషి మరణం
మధ్య కాలమే మనిషి జీవనం
నిత్యం కలిగి ఉండాలి మంచి గుణం!
 

No comments: