శీర్షిక: మహిళల శ్రమ దోపిడి!
అదిగదిగో అవి సర్కారు బస్సులు
ఆర్డినరీ బస్సులు మెట్రో బస్సులు
మహిళలకు ఉచిత ప్రయాణ బస్సులు
రాష్ట్ర మంతా ఉచితమే బస్సులలో!
బస్సుల్లో ఉచిత ప్రయాణమనగానే
మహిళలు సంబరపడిరి సంతోషపడిరి
నాలుగు రోజులు హాయిగా తిరిగిరి
ఇంటికి వచ్చి మరో నలుగురికి చెప్పిరి!
బస్సులన్ని కిటకిట లాడిపోతుండే
బస్సులు ఎక్కాలన్నా దిగాలన్నా
కనబడుతాయి ఆకాశంలో చుక్కలు
పడుతాయి శరీరాలకు చెమటలు!
ఆడవారికి ఆడవారితోనే పంచాయితీలు
సీట్ల కొరకు సిగ పట్లు ఆ పైన ముష్టి యుద్దాలు
మగవారిలో కొందరు వెకిలి చూపులు
సీనియర్ సిటిజన్ల సీట్లు ఆక్రమణలపాలు!
ఆధార్ మహిళలంటే కండక్టర్లకు లోకువైనా
మగవారి మధ్యలో నలిగి పోతుండిరి
ఎక్కడ బడితే అక్కడ కూర్చుంటుండిరి
అష్టకష్టములతో ఆగమై పోతుండిరి
అంతటితోనే ఇక్కట్లు ఆగుతుండెనా!
రాబోయే కష్ట నష్టాల నెరుగకుండిరి
నాలుగు నెలల వరకు మిన్నకుండిరి
నేడు అలిసి సొలసి కుమిలి పోతుండిరి
ఇది స్త్రీల శ్రమ దోపిడని తెలుసుకునిరి!
తెలివైన వారండి మగ మహారాజులు
పురుషులకు ఉచితం లేదన్న కోపమో
లేక ఆడవారికి ఆది శాపమో
గొప్ప ఉపాయమే పన్నారు మగధీరులు!
బస్సు కిరాయిలు మిగులుతాయనీ
ఎండా వానలు రాత్రీ పగలు చూడకుండా
పండుగలు పబ్బాలు వదలకుండా
దూర భారము లెక్క చేయకుండా
త్రిప్పు తున్నారు స్త్రీలను బస్సులలో!
ఎక్కడికైనను ఎంత దూరమైనను
ఉచితమే బస్సు పొమ్మంటున్నారు
ప్రతి పనికి మహిళలనే పంపుతున్నారు
నీడ పట్టున పురుషులు ఉంటున్నారు!
బస్సు చార్జీలు మిగులు తున్నాయని
బార్లకు పోవడం మొదలు పెట్టారు
ఇప్పుడు త్రాగుడుకు బానిసలు అయ్యారు
త్రాగుబోతు సోమరులుగా మారిపోయారు
అష్టకష్టములతో ఆగమై పోతుండిరి
అంతటితోనే ఇక్కట్లు ఆగుతుండెనా!
రాబోయే కష్ట నష్టాల నెరుగకుండిరి
నాలుగు నెలల వరకు మిన్నకుండిరి
నేడు అలిసి సొలసి కుమిలి పోతుండిరి
ఇది స్త్రీల శ్రమ దోపిడని తెలుసుకునిరి!
తెలివైన వారండి మగ మహారాజులు
పురుషులకు ఉచితం లేదన్న కోపమో
లేక ఆడవారికి ఆది శాపమో
గొప్ప ఉపాయమే పన్నారు మగధీరులు!
బస్సు కిరాయిలు మిగులుతాయనీ
ఎండా వానలు రాత్రీ పగలు చూడకుండా
పండుగలు పబ్బాలు వదలకుండా
దూర భారము లెక్క చేయకుండా
త్రిప్పు తున్నారు స్త్రీలను బస్సులలో!
ఎక్కడికైనను ఎంత దూరమైనను
ఉచితమే బస్సు పొమ్మంటున్నారు
ప్రతి పనికి మహిళలనే పంపుతున్నారు
నీడ పట్టున పురుషులు ఉంటున్నారు!
బస్సు చార్జీలు మిగులు తున్నాయని
బార్లకు పోవడం మొదలు పెట్టారు
ఇప్పుడు త్రాగుడుకు బానిసలు అయ్యారు
త్రాగుబోతు సోమరులుగా మారిపోయారు
పనికి పో అంటే మొద్దు నిద్ర పోతున్నారు!
అవునన్నా కాదన్నా ఎవరేమనుకున్నా
ఇది *మహిళల శ్రమ దోపిడే* నన్నా
ఉచిత బస్సు వనితలకు నరకమే నన్నా
అవునన్నా కాదన్నా ఎవరేమనుకున్నా
ఇది *మహిళల శ్రమ దోపిడే* నన్నా
ఉచిత బస్సు వనితలకు నరకమే నన్నా
అర్హులకే ఉచిత ప్రయాణం కోరాలన్నా
ఆలుమగల మధ్య పంచాయితీలు వద్దన్నా
నిండు సంసారాలు కూల్చ వద్దన్నా!
ఆలుమగల మధ్య పంచాయితీలు వద్దన్నా
నిండు సంసారాలు కూల్చ వద్దన్నా!
No comments:
Post a Comment