*అంశం*- *వాక్య కవిత*
*ఎదురుగా పొగడ్తలు వెనుక అసూయపు మాటలు*
శీర్షిక: *ఓడ దాటే దాకా ఓడ మల్లన్న*
శిశువు పుట్టడమే ఆకలితో
అందుకే జన్మించగానే తే.. తే..అని ఏడుస్తాడు మనిషి ఆశా జీవి ఆశ అనేది అతని శ్వాస
వయసు పెరుగుతున్న కొద్దీ స్వార్ధం పెరుగుతుంది!
ఆశలు కోరికలు అవసరాలు స్వార్ధానికి దారితీస్తే "అవకాశాలు" స్వార్ధాన్ని సఫలీకృతం చేయడంలో కృతకృత్యమవుతాయి! ఆ "అవకాశాలు" అనేవి సమాజం కావచ్చు ఎదురుగా ఉన్న తోటి మనుషులు కావచ్చు సులభంగా లభించే డబ్బు కావచ్చు ప్రభుత్వ విధానాలు చట్టాలు కావచ్చు!
మనిషి తన స్వార్ధ పూరితమైన కోరికలు పదవులు గెలుపులు పనులు సునాయాసంగా నెరవేరడానికి ఎదురుగా వారిని పొగుడుతారు పని పూర్తి కాగానే వెనుకాల తెగుడుతారు!
అందుకే పుట్టింది ఒక తెలుగు సామెత కాబోలు *ఓడ దాటే దాకా ఓడ మల్లన్న ఓడ దాటాక* *బోడి మల్లన్న* అని
ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేముందు మల్లన్న గొప్ప నిపుణుడు, ఓడను బాగా తోలుతాడు అని ఎదురుగా మెచ్చుకుని
నదిని దాటాక, మల్లన్న దేముంది బోడి, నేనే సలహాలు ఇస్తుంటేనే తెడ్డును తిప్పాడు
అతనికి ఓడ నడుపడమే రాదని వెనుకాల ఇతరులకు చెబుతూ తులనాడుతాడు!
అందరూ ఇలాగే ఉంటారా అంటే, కాదు,అందరు అలానే ఉండరు అనే చెప్పాలి మానసిక పరిపక్వత చెందని వారు స్వార్థం అసూయ అహం తలకెక్కిన వారు పదవుల కోసం రాజకీయ నాయకులు పరిస్థితుల ప్రభావం చేత కొందరు ఇలా ఉంటారు
వ్యక్తిత్వం గలవారు ఆధ్యాత్మిక వేత్తలు
భగవద్గీత సంపూర్ణంగా చదివిన వారికి
ఎలాంటి స్వార్ధం ఈర్ష్య అసూయలు అహం సంకుచిత బుద్దులు కుల్లు కుతంత్రాలు దరిచేరవు ఉదా: రామకృష్ణ పరమహంస గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద మరెంతో మంది గలరు!
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
Pages
- Home
- About us
- Privacy Policy
- Disclaimer
- సామాజిక సమస్యలు & పరిస్కారాలు (SOCIAL PROBLOMS & SOLUTIONS)
- వివాహ వ్యవస్థ (MARRIAGE SYSTEM)
- ఎన్నికల సంస్కరణలు (ENNIKALA SAMSKARANALU)
- జ్యోతిష్యం (JYOTHISHYAM)
- Quiz /Puzzles
- AROGYAME MAHABHAGYAM
- బాల గేయాలు
- సీస పద్యాలు -ఛందస్సు - వీడియోలు (SEESA PADYALU - CHANDASSU- VIDEOS)
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- షేర్ మార్కెట్ /మ్యూచువల్ ఫండ్స్ (SHARE MARKET & MUTUAL FUNDS)
- కవి పరిచయాలు / INTRODUCTION OF POETS
- జీవిత సత్యాలు / LIFE CHANGING QUOTES / JEEVITHA SATYALU
- ఐడియాలు / టిప్స్ & ట్రిక్స్ (IDEAS / TIPS & TRICKS )
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- Sinima Songs -Lyrics / సినిమా పాటల - లిరిక్స్
- Budget 2023
- తెలుగు సాహిత్య ప్రక్రియల వీడియోలు / Sahitya Prakriyala Videos
Total Pageviews
Tuesday, June 24, 2025
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న ఓడ దాటాక బోడి మల్లన్న
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment