అంశం: *నా తెలంగాణ కోటి రతనాల వీణ*
శీర్శిక: *తెలంగాణ సాహిత్య కెరటం దాశరథి!*
నిజాం నవాబుకు ప్రక్కలో బల్లెం
నిజాం అరాచకాలకు వేసిన కళ్ళెం
నిరంకుశత్వం పై ఎక్కుపెట్టిన కలం
నవాబు దుశ్చర్యలపై ఎత్తిన గళం!
నిజాం రజాకార్లపై మోపిన ఉక్కు పాదం
నైజాం పిశాచికి ఉరిబిగించిన పలుగు త్రాడు
నవాబు దుశ్చర్యలను చీల్చి చెండాడిన చురకత్తి
జైలు ఆగడాలకు బొగ్గుతో అగ్గి రాజేసిన నిప్పు రవ్వ!
దాశరథి ఒక అభ్యుదయవాది
ఉధ్యమ కారుడు విప్లవకారుడు ధీరోదాత్తుడు
కవి రచయిత విద్యావేత్త గ్రంధకర్త వ్యాఖ్యాత
బహుభాషా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి!
నాటి వరంగల్ జిల్లా మారు మూల
గ్రామమైన చిన్న గూడూరులో జన్మించినా
నిజాం దుశ్చర్యలపై రాల్చిన నిప్పరవ్వలతో
ధైర్య సాహసాలతో విశ్వవ్యాప్తమయ్యారు!
తెలంగాణ భుక్తి కోసం విముక్తి కోసం
*నా తెలంగాణ కోటి రతనాల వీణ* అని
గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి
ప్రేరణ అందించిన కవి దాశరథి కృష్ణమాచార్య!
సిమెంట్ కలిపిన రొట్టెలను తింటూ
జైలు జీవితం గడుపుతూ జైలు గోడలపై
బొగ్గుతో నిజాం వ్యతిరేక నినాదాలు వ్రాసి
నిగ్గదీసిన మొక్కవోని ధైర్యశాలి
స్వాతంత్ర సమరయోధుడు దాశరథి!
అగ్ని ధార మహాంధ్రోద్రయం రుద్రవీణ
మరెన్నో ఖండ కావ్యాలు శతకాలు
గజల్స్ జానపద గీతాలు పాటలు రచించి
తెలంగాణ సాహిత్య రంగంలో
ఎనలేని కృషి చేసిన ఘనాపాటి
అనేకమైన రివార్డులు బిరుదులు పొందిన
తెలంగాణ సాహిత్య కెరటం దాశరథి!
తెలంగాణ ప్రభుత్వం ఈ యేడు
దాశరథి శతజయంతి ఉత్సవాలు జరపడం
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు
కృష్ణమాచార్యకు ఇచ్చే గొప్ప నివాళులు
యావత్ కవులకు లభించిన గొప్ప సత్కారం!
No comments:
Post a Comment