శీర్షిక: నేను ఎగిరే పక్షినైతే ఎంతబాగుండో!
అపార్ట్మెంట్ కు అతి చేరువలో
అతి చేరువలో ఎత్తైన పచ్చని వృక్షాలు
వృక్షాలపై వాలాయి రంగు రంగుల పక్షులు
పక్షులలో ఉన్నాయి ఎన్నో జాతులు
వయ్యారంగా కొమ్మలు నాట్యం చేస్తుంటే
పట్టు తప్పిన పక్షులు తమ రెక్కలను
రెప రెప లాడిస్తూ మేను మేనూ కలుపుతూ
ప్రక్కన పక్షులున్నాయన్న ద్యాస మరిచి
పక్షులకు ఉండవని తెలుసుకున్నాను
ఈర్ష్య అసూయలు కక్షలు కార్పణ్యాలను
ద్వేషాలు రోషాలు స్వార్ధాలు భయాలను
ఆర్ధిక అంతరాలు ఆరిపోసుకోవడాలను
అందుకే కాబోలు వాటికి నచ్చినట్లు
అవి గంతులు వేస్తూ చిందులు వేస్తూ
కొన్ని ఎగిరి పోతూ కొన్ని వచ్చి వాలుతూ
ఆనందంగా విహరిస్తున్నాయి
ప్రక్కన పక్షులను పట్టించుకోకున్నాయి
నేను ఎగిరే పక్షినైతే ఎంతబాగుండో!
No comments:
Post a Comment