శీర్షిక: *ఆవు ప్రాణదాత*
ఆవు ఆరాధ్య దేవత
ఆవు జనులకు గోమాత
పాలు ఇచ్చును గోమాత
ఆవు మనకు ప్రాణదాత!
గోవులను మ్రొక్కిన చాలు
కలుగును ఎంతయో మేలు
తెలుపు నలుపుల్లొ ఆవులు
నిద్రిస్తుండును మాపులు!
పాల నుండి పెరుగును వచ్చును
పెరుగు నుండి వెన్నయు వచ్చును
వెన్న నుండి నెయ్యియు వచ్చును
నెయ్యి అమ్మిన డబ్బు వచ్చును!
గోమాత పేడతో గోముగ పిడకలు
పాలతోని నెయ్యితోని పానకములు
చేసియు పలుపూజలు చేసేరు జనులు
గోమాత ఇచ్చును జనులకు వరాలు!
పిడికెడు తవుడు పెట్టిన చాలు
ఆవునందు సమస్త ఆరాద్యులుందురు
ఆవును జనులెల్ల అమ్మగా భావించి
నిత్యము కొలుతురు నిలన చూడు
గోమాత పేడతో గోముగా పిడకలు
పాలతో నెయ్యియు పాన కంబు
చేసియు పూజలు చేసెదరుజనులు
ఆవు నరులకు దేవత అన్న ఎద్దు
గోవుల విశిష్టత
గోవును సేవించి గోపాలుడైనాడు
గోమాత నిచ్చును గోము పాలు
భారతీయులు నిల పిలిచెదరుగ
గోవులు పవిత్రత నెల్లరు గొప్ప ననిరి
గోవు భారతీయులయొక్క గోపురంబు
ఆవు ఆరాధ్య దేవత అవని యందు
పాలు యిచ్చును మూత్రము పాల వోలె
సేవనంబు చేసేరులే శీతలమున
No comments:
Post a Comment