Friday, June 6, 2025

నవ చైతన్యం

అంశం: చైతన్యం

శీర్శిక: *నవనవోన్మేషంతో సాగుతుండు*

కొత్త ఒక వింత పాత ఒక రోత
కాలాలు ఋతువులు మార్పుల మోత
ఇష్టాలకు అవసరాలకు పరిస్థితితులకు
ప్రాంతాలకు అనుగుణంగా వాత
మార్పు అనివార్యమంటుంది మాత!

మార్పు లేకుండా  మనుగడ అసంభవం
మనుషులలో చైతన్యం నవచైతన్యం
ఉంటేనే ఏ  మార్పైనా సాధ్యం
గ్లోబలైజేషన్ కారణంగా నేడు ప్రపంచం
ఒక కుగ్రామంగా మారినా గమనించం!

టెక్నాలజీ అధికంగా అభివృద్ధి చెందినా
వైఫై సోషల్ మీడియా పెరిగినా
విస్త్రుతంగా అందుబాటులోకి వచ్చినా
ప్రజలు చైతన్య వంతులు కావాలి
సమాజాభివృద్ధికి ఉపయోగ పడాలి!

కొత్త కొత్త పోకడలకు అలవాటు పడుతూ
నిత్యనూతన మార్పులను తీసుకుని వస్తూ
కొంగ్రొత్త వాటిని కనిపెడుతూ
అవసరాలకనుగుణంగా మార్పులు చేస్తూ
నవనవోన్మేషంతో ముందుకు సాగుతూ ఉండు!

ఈ నూతన చైతన్య మైనా సమాజానికి
సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా
ప్రకృతి కి అనుగుణంగా ఉన్నంత వరకు
ప్రజలకు మేలు చేసేది అయితే 
కొత్తది వింతే అయినా దానిని ఆహ్వానించాలి
పాత దానిని త్యజించాలి
లేదంటే దేశాభివృద్ధి కుంటుబడటానికి 
ఎంతో సమయం పట్టదు! 

No comments: