Friday, June 13, 2025

రంగురంగుల చెత్త బుట్టలు

అంశం: చెత్త బుట్ట


శీర్షిక: *రంగు రంగుల చెత్త బుట్టలు*

చెత్త చెదారంతో ఇల్లంతా
కలచి వేస్తుంది మనసంతా
చిరాకు వేస్తుంది వొళ్లంతా
బుట్టలో వేయాలి చెత్తంతా!

సర్కారు ఇచ్చిరి చెత్త బుట్టలు
రంగురంగుల చెత్త బుట్టలు
ఆకుపచ్చ నీలి రంగు బుట్టలు
తడి పొడి పదార్ధాలు వేయ బుట్టలు!

చెత్త బుట్టలు బయట పెట్టాలి
రోజూ ఇంటిని శుభ్రం చేయాలి
తడి పొడి చెత్తను బుట్టల్లో వేయాలి
పొద్దున్నే చెత్త బండి వాడికి ఇచ్చేయాలి!

మూలకున్న చీపిరని గేలిచేయకు
మసి గుడ్డ అని తీసిపారేయకు
చెత్త బుట్ట అని హేలన చేయకు
ముసలోడు తాత అని చులకన చేయకు
దేనినీ ఎవరినీ అశ్రద్ద చేయకు! 

No comments: