గజల్ లక్షణాలు/వివరణలు:
1. గజల్ కు శీర్షిక ఉండదు
2. గజల్స్ నవరసాలలోని ఏ రసాన్నైనా పండించ వచ్చు
3. గజల్ ను బట్టి ప్రతి పాదంలో 4, 5, 6,7 పదాలు ఉండవచ్చు
4. గజల్ ను బట్టి ప్రతి పదానికి ఒకే సంఖ్యలో మాత్రలు ఉండాలి
ఉదా: 5 మాత్రలు, 7 మాత్రలు ఇలా
5. ప్రతి పాదాన్ని *మిశ్రా* అంటారు
6. మొదటి రెండు పాదాలను కలిపి *మత్లా* అంటారు
7. మూడవ పాదం నుండి ప్రతి రెండు పాదాలను *షేర్* అని అంటారు
8. ప్రతి పాదంలోని చివరి పదానికి ముందు ఉన్న పదాన్ని *కాఫియా* అని అంటారు.
*కాఫియాలకు* : చివరలో *టే* అనేది రావాలి. *టే* కు ముందున్న అక్షరం *ఉం* శబ్ధంతో ఉండాలి.
ఉదా: వేడుకుంటే, పడుతుంటే, పావులుంటే, చెంతనుంటే,అడ్డుకుంటే, కాలముంటే మొ.నవి. (7 మాత్రలు)
9. ప్రతి పాదంలోని చివరి పదాన్ని *రదీఫ్* అని అంటారు . సాధారణంగా 1,2,4,6,8,10,12,14 వ పాదాలకు *రదీఫ్* లను ఉపయోగిస్తారు.
*రదీఫ్* లకు ఉదా: మురిసి పోనా, మురిసి పోతా, బాధపడుతా, ఎంతకష్టం,హాయి కాదా మొ.నవి (7 మాత్రలు)
10. పై అన్ని లక్షణాలతో పాటు పాడటానికి లయబద్ధంగా అర్ధవంతంగా ఉంటే అది గజల్ అవుతుంది
తెలుగు గజల్స్ లో కురువృద్ధులు డా.దాశరథీ మరియు డా. సి. నారాయణ రెడ్డి
అంశం: మిశ్రాగతి తెలుగు గజల్ (7+7+7+7)
చినుకు పడగా ఆరుబయటా ఆడుతుంటే తడిసి పోనా వానపడగా మిద్దెపైనా పాడుతుంటే తడిసి పోనా !
కూర గాయలు తెమ్మని చెప్పడమూ నీకూ తేలికేనూ గొడుగు లేకా దారివెంటా నడుస్తుంటే తడిసి పోనా!
పాల పాకెటు తేకపోతే ఎందుకంతా చిరాకోయీ షాపు బయటా చాలసమయము నిలబడుంటే తడిసిపోనా!
ఉషోదయాన మబ్బులులేమీ లేవుకదూ నింగిలోనా తలపైననే పైట కొంగును వేసుకుంటే తడిసిపోనా!
ఆన్లైనులోన ఆర్డరుచేయి అందమైనా కేకు కృష్ణా వర్షంలోన అస్తమానం తిరుగుతుంటే తడిసి !
No comments:
Post a Comment