Tuesday, July 29, 2025

రెప్ప పాటు కాలమే మనిషి జీవితం

అంశం: *నిత్యం పరులపై ఏడవకు నవ్వుతూ జీవించు*


శీర్షిక: *రెప్ప పాటు కాలమే మనిషి జీవితం*

కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జీవనం
రెప్ప పాటు  కాలమే మనిషి జీవితం
నీటి బుడగ వంటిది మానవ ప్రాణం
ఎవరు ఎంత కాలం జీవిస్తారో తెలియదనేది సత్యం!

ఇంత సున్నితమైన జీవితమనీ
మరెంతో విలువైన ప్రాణమనీ తెలిసియూ
మనిషి ఈర్ష్యలు అసూయలు కక్షలు
కార్పణ్యాలు ఆశలు కోరికలు స్వార్ధాలు!

పగలు పంతాలు పట్టింపులు ఇగోలతో
సతమత మవుతూ
నిత్యం ఏదో ఒక సంఘర్షణతో బాధ పడుతూ
అశాంతి అసహనంతో జీవిస్తుంటారు!

సృష్టిలోని ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో
పరమోత్కృష్టమైన జీవుడు మానవుడు
ఇంతటి గొప్ప మానవ జీవితాన్ని
సద్వినియోగం చేసుకోవాలి
*నిత్యం పరులపై ఏడవకుండా నవ్వుతూ జీవించాలి*!

నవ్వు నాలుగు విధాల మేలు చేయు
మనసును ప్రశాంతంగా ఉంచుతుంది
ఆరోగ్యంగా  నిలుపుతుంది
ఆయుష్షును పెంచుతుంది
అలానే చక్కని సలహాలు ఇవ్వడానికి
మంచి నిర్ణయాలు తీసుకోవడానికి
దోహదపడుతుంది!

No comments: