Saturday, July 26, 2025

నాగుల పంచమి

అంశం: భక్తి గేయాలు (నాగుల పంచమి )


శీర్షిక: నాగుల పంచమి

పల్లవి:
కశ్యప మహర్షివి నీవయ్యా
వినత కద్రువ నను సతీమణులతో
గురుడు నాగులకు జన్మనిస్తిరి
మా నోముల పంటలు మీరేనయ్యా!     "కశ్యప"

చరణం:01
గరుడు విష్ణువుకు వాహనమయ్యా..
నాగు విష్ణువుకు శయన వేదికయ్యా..
ప్రతియేటా శ్రావణమాసం
శుక్ల చవితి రోజు నాగుల చవితి జరిపెదరు..  "కశ్యప"

చరణం:02
ప్రతియేటా శ్రావణమాసం
శుక్ల పంచమి రోజు
గరుడ పంచమి జరిపెదరు
ఉత్సాహంగా పూజలు చేసెదరు...  "కశ్యప"

చరణం:03
నాగుల చతుర్ధి రోజు గరుడ పంచమి రోజు
పసుపు కుంకుమలతో పూలు పాలతో
ధూప నైవేద్యాలతో భక్తులు కొలిచెదరు
కోరిన కోరికలు తీరెనందురు...              "కశ్యప"
 

No comments: