అంశం: *విలువలు లేని బ్రతుకులు*
శీర్శిక: *సువాసన లేని కుసుమాలు*
విలువలు లేని బ్రతుకులు
నీరు లేని ఎడారులు
వర్షం కానని ఎండమావులు
సువాసన లేని కుసుమాలు!
విలువలు ఎండమావులుగా గాకుండా
నిత్యం జీవనదిలా ప్రవహించాలి
జీవించినంత కాలం సృజనాత్మకతతో
సాగిపోతూ ఉండాలి
అప్పుడే మనిషికి గౌరవం పెరుగుతుంది !
మంచి నడవడిక ప్రవర్తన ఆలోచన
నీతి నిజాయితీ నిబద్ధత నిశ్చలత
విలువలతో కూడిన జీవన శైలి
మాట తప్పకుండా ధర్మంగా ఉండటం
సమయ పాలన సత్యం మాట్లాడటం
క్రమశిక్షణతో బ్రతకడం
తోటి వారి పైన ప్రేమ దయ కరుణ చూపడం
వంటి సద్గుణాలు విలువలకు ప్రతీకలు!
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న
ఓడ దాటాక బోడి మల్లన్న లా
అవసరాల కోసం నటించడం
అవసరం తీరాక విమర్శించడం
విలువలు ఉన్న వ్యక్తిగా గుర్తింపబడడు!
వ్యక్తిత్వం గుణాలు ఏ ఒక్క రొజో
రెండు రోజులో కాకుండా
ఎల్లప్పుడూ ఉండేటట్లు చూసుకోవాలి
అప్పుడే వ్యక్తిత్వ స్థిరత్వం అంటాము!
గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమహంస
స్వామి వివేకానంద శ్రీరాముడు శ్రీకృష్ణుడు
మరెందరినో చక్కని విలువలు గల వారిగా
గుర్తింపబడినారు!
No comments:
Post a Comment