Monday, July 21, 2025

ఆశల పల్లకి

*అంశం*పదాల కవిత*

*1*చలిలో గిలిగింత* *2*మల్లెల మాసం*
*3*కనుల పలకరింత* *4*నీ వెంటే నేను*

శీర్షిక : *ఆశల పల్లకి*

ఒక్కో ఋతువుకు ఒక్కో ప్రత్యేకత ఆడుతూ పాడుతూ అలరిస్తుంది ప్రకృతి...

శిశిరంలో  మంచు దుప్పట్లలో  *చలిలో గిలిగింత* మనసులో ఏదో తీరని కోరిక...

చల్లని గాలులతో ఒల్లంతా పులకరింతా మదిలో కలవరింత ....

నిత్యం పూవులు  ఇంటింటా ఆనందోత్సవాల పంట....

నదులు తరులు ఝరుల హోరుతో  మదిలోని ఊసులు రేయంత ....

చలి గాలుల తిమ్మరలతో  రోజంతా మనసు హాయంట  ...

మన జంట నాకు వేయి జన్మలు నోచిన వరమోయ్  ....

ఈ జన్మలో మరుజన్మలోనూ నీకు తోడూ నీడా  నేనేఉంటా ....

ఆషాఢమాసంలో పట్టు పరుపులపై నీవు ఒంటరిగా పవళించాలట పడకింట ...

*కనుల పలకరింత* తో వేచి యుంటూ ఒంటరిగా పవళిస్తాను నాయింట...

మన కొత్త జంటలో ఉన్నది మహోన్నతమైన  ప్రేమంట .... 

ప్రతినిత్యం *నీ వెంటే నేను* ఉంటా అది నా ఆనతి అంట....

వసంత ఋతువులోనే కదూ *మల్లెల మాసం*
అదేనూ మన కలల పంట....

ఆశల పల్లకిలో ఆకాశంలో ఆనందంగా విహరిద్దాం నీ కడుపు పండగ....

No comments: