Monday, July 7, 2025

జల లోకం

 అంశం: చిత్ర కవిత

శీర్షిక: *జల లోకం*

*తానొకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది*
అన్నట్లు
మనిషి ఒకటి అనుకుంటే సృష్టిలో
మరొకటి జరుగుతుంది సృష్టి శక్తివంతమైనది
మనిషికి ఎంత తెలివి ఉన్నా సృష్టిని మించలేడు

లంగర్ వేసి ఉన్న లక్షల విలువ చేసే తమ పడవ
తాను చూస్తుండగానే ముక్కలై సముద్రంలో
కొట్టుకొని పోవడాన్ని  చూస్తూ స్వయంగా ఒప్పుకున్నారు
శాస్త్ర వేత్త డాక్టర్ అబ్దుల్ కలామ్ గారు, ప్రకృతి
ఎంత శక్తి వంతమైనదో ననీ..

మనం చూస్తూనే ఉంటాం
భూకంపాలు వచ్చినప్పుడు భూమి పగుళ్ళు
అగ్ని పర్వతాలు మండినపుడు లావా ధారలు
తుఫానులు వర్షాలు వరదలు రావడంతో
మనిషి ఎంత బలంగా కట్టుకున్న కట్టడాలు
వంతెనలు నిర్మాణాలు వాహనాలు ఆస్తులు
ఎలా నేల మట్టం అవుతాయో
ఎలా జలమయమవుతాయో
మనుష్యులు జంతువులు
ఎలా కనుమరుగై అవుతాయో!

నేడు భూలోకంలో ప్రజల
అవసరాలకు తగినట్లుగా ప్రయాణమార్గాలను
ప్రయాణ వాహనాలను నిర్మిస్తున్నారు
రోడ్డు మార్గాలు రైలు మార్గాలు
సరుకుల రవాణాకు జలమార్గాలు
బస్సులు కార్లు ఆటోలు బైకులు
రైల్లు విమానాలు పడవలు నిర్మిస్తున్నారు

భూలోకంలో భూమి తక్కువ నీరు ఎక్కువ
రోజురోజుకూ భూమిని నీరు మ్రింగేస్తుంది
మరికొంత కాలానికి భూమి అదృశ్యమై
*జలలోకం* రావచ్చని చిత్రకారుడి ఊహ

నిజంగానే జల లోకం ఏర్పడి నట్లైతే
అప్పుడు రోడ్డు రవాణా మార్గాలు
రవాణా వాహనాలు కనుమరుగై పోతాయి
జలమార్గ కార్లు తయారవుతాయి!

ప్రతిఒక్కరూ మార్పును
సంతోషంగా అంగీకరించాలి
మార్పుకు తగినట్లుగా తయారవ్వాలి!

No comments: