శీర్షిక: *కులవృత్తి బంధు పధకం రావాలి*
"దేశమంటే మట్టి కాదోయ్ దేమంటే మనుషులోయ్''
అన్నారు మహాకవి గురుజాడ
"మనుషులు చేసే వృత్తులను బట్టే కులాలోయ్"
*కులాలను బట్టే మనుషుల జీవన విధానాలోయ్"
*ఇది తరతాలనుండి వస్తున్న వృత్తి సాంప్రదాయాలోయ్*
కులాలతోని ఎవరు జన్మించ లేదనీ
వారు చేసే పనులను నైపుణ్యతను బట్టి
వాటిల్లో స్థిరపడి పోవడం వలన
కులాలు ఏర్పడ్డాయనేది నగ్న సత్యం!
బ్రాహ్మలు క్షత్రీయులు వైశ్యులు శూద్రులు
అనేవి కూడా అలా ఏర్పడిన వర్గాలే
కుండలు తయారు చేసే వారిని కుమ్మరులని
చెక్క పనులు చేయువారిని వడ్రంగులనీ
నగలు చేయువారిని కౌంసలి వారనీ
కల్లు దింపే వారిని గౌండ్ల వారనీ
బట్టలుతికి ఇస్త్రీ చేసే వారిని రజకులనీ
సవరం చేయువారిని నాయి బ్రాహ్మణులనీ
వైద్యం చేసేవారిని వైద్యులనీ
వస్తువులను అమ్మే వారిని శావుకార్లనీ
వేదాలు చదివే వారిని బ్రాహ్మణులనీ
పూజలు చేసేవారిని అయ్యగార్లనీ పంతుల్లనీ
ఇలా అనేక వృత్తుల వారు
వారి వృత్తులను బట్టి పిలువబడుతున్నారు
ఇక్కడ ఏ కులము ఎక్కువ కాదు
ఏ కులము తక్కువ కాదు అందరు సమానులే
మనిషి గుణాన్ని బట్టి విలువ నివ్వాలి
కానీ కులాన్ని బట్టి కాదు
కుల వృత్తులు అభివృద్ధి చెందినపుడే
మనుషులు ఎదుగుతారు
మనుషులు ఎదిగి నపుడే రాష్ట్రాభివృద్ధి
రాష్ట్రాలు ఎదిగినపుడే దేశాభివృద్ధి
ఏవో కొన్ని కులాలు అభివృద్ధి చెందుతే
అభివృద్ధి అనబడదు
అన్ని కులాల లోనూ పేదలు ఉన్నారు
అన్ని కులాలలోని పేద మధ్యతరగతి ప్రజలు
అభివృద్ధి చెందాలి
కుల వృత్తులు వ్యవసాయం చేనేత అద్దకం
బుట్టలల్లడం తట్టలల్లడం పూలు అల్లడం
వడ్రంగి నగలు చేయడం కల్లుగీత పని
చేపలు పట్టడం పాలు పితకడం
పూజలు నిర్వహించడం ఇలా ఏవైనా కావచ్చు
ఎవరి వృత్తులలో వారికి ఇష్టం ఉంటుంది
ఆసక్తి ఉంటుంది అభిమానం ఉంటుంది
గౌరవం ఉంటుంది అంకిత భావం ఉంటుంది
కానీ ఏ కోశానా నాదాను ఉండదు
అయిష్టత ఉండదు
ఎందుకంటే అది వారి వారసత్వ వృత్తులు
ఎవరు చేసే పనులు వారే చేయగలరు
ఇతరులు చేయలేరు నాణ్యత లోపిస్తుంది
అయిష్టత ఉంటుంది నాదానుతనం ఉంటుంది!
పారిశుద్ధ్య కార్మికుల పనులు
పారిశుద్ధ్య కార్మికులే చేయగలరు
ఇతరులు చేయలేరు
వారిని అశ్రద్ద చేస్తే ప్రజల ఆరోగ్యాలకే హాని
కులవృత్తులు అభివృద్ధి చెందుతే
నిరుద్యోగ సమస్యలు తగ్గుతాయి
కుటుంబ ఆదాయ వనరులు పెరుగుతాయి
కుటుంబ వ్యవస్థ మెరుగవుతుంది
ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు
అందుకే ,
లంబాడీలు అభివృద్ధి చెందాలంటే
లంబాడీ బంధు పధకం
వడ్డెరలు అభివృద్ది చెందాలంటే
వడ్డెర బంధు పధకం
మన్నెపువారు అభివృద్ది చెందాలంటే
మన్నెపు బంధు పధకం
యాదవులు అభివృద్ధి చెందాలంటే
యాదవ బంధు పధకం
కుమ్మరులు అభివృద్ధి చెందాలంటే
కుమ్మరి బంధు పధకం
కమ్మరులు అభివృద్ధి చెందాలంటే
కుమ్మరి బంధు పధకం
పద్మశాలీలు అభివృద్ధి చెందాలంటే
పద్మశాలి బంధు పధకం
బెస్తవారు అభివృద్ధి చెందాలి
బెస్త బంధు పధకం
చాత్తాద శ్రీవైష్ణవులు అభివృద్ధి చెందాలంటే
చాత్తాద శ్రీవైష్ణవ బంధు పధకం
నాయిబ్రాహ్మణులు అభివృద్ధి చెందాలంటే
నాయిబ్రహ్మణ బంధు పధకం
రజకులకు బంధు పధకం కావాలి
రజకులు అభివృద్ధి చెందాలి
కాపుల బంధు పధకం కావాలి
కాపులు అభివృద్ధి చెందాలి
రెడ్ల బంధు పధకం కావాలి
రెడ్లు అభివృద్ధి చెందాలి
దాసరి బంధు పధకం కావాలి
దాసరులు అభివృద్ధి చెందాలి
ముష్లిమ్ బంధు పధకం కావాలి
ముష్లిములు అభివృద్ధి చెందాలి
క్రైస్తవ బంధు పధకం కావాలి
క్రైస్తవులు అభివృద్ధి చెందాలి
శాల బంధు పధకం రావాలి
శాలవారు అభివృద్ధి చెందాలి
మార్వాడి బంధు పధకం కావాలి
మార్వాడులు అభివృద్ధి చెందాలి
కటిక బంధు పధకం కావాలి
కటిక వారు అభివృద్ధి చెందాలి
గౌడు బంధు పధకం కావాలి
గౌండ్ల వారు అభివృద్ధి చెందాలి
ఔసుల బంధు పధకం కావాలి
ఔసుల వారు అభివృద్ధి చెందాలి
కంసాలి బంధు పధకం కావాలి
కంసాలి వారు అభివృద్ధి చెందాలి
దూదేకుల బంధు పధకం రావాలి
దూదేకులవారు అభివృద్ధి చెందాలి
గానుగ బంధు పధకం కావాలి
గానుగ వాండ్లు అభివృద్ధి చెందాలి
వడ్రంగి బంధు పధకం కావాలి
వడ్రంగి వారు అభివృద్ధి చెందాలి
ముధిరాజ్ బంధు పధకం కావాలి
ముధిరాజులు అభివృద్ధి చెందాలి
వెలమ బంధు పధకం కావాలి
వెలమలు అభివృద్ధి చెందాలి
బ్రాహ్మణ బంధు పధకం కావాలి
బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
ఇతరకులాల బంధు పధకం కావాలి
ఇతర కులస్తులు అభివృద్ధి చెందాలి
No comments:
Post a Comment