Thursday, July 10, 2025

ఆషాఢమాసం విశిష్టత - శుద్ధ పౌర్ణమి

ఆషాడం- పౌర్ణమి సంబరం


శీర్షిక: "ఆషాఢ మాసం విశిష్టత- శుద్ధ పౌర్ణమి"

ఆషాడమంటేనే జనులకు ఆనందదాయకం
మాసములలో నాలుగవవది ఆషాడమాసం
వర్షాలు వాగులు పొర్లుతుండు ప్రతి నిత్యం
వనితలు పెట్టేరు గోరెంటాకు అను నిత్యం!

ఆషాడమాసమునకు విశిష్టత మెండుగ
బోనాలు ప్రజలకు గర్తుకొచ్చే పండుగ
పూరీ జగన్నాథ్ యాత్ర జరుగును ఘనంగ
నూతన వధువులు పుట్టిల్లు చేరు సంబరంగ!

ఆషాఢమాసంలో శుద్ధ పౌర్ణమికి
మరెంతో ప్రాధాన్యత

మహాభారతం భాగవతం రచించిన
చతుర్వేదాలను సంకలనం చేసిన
ఉపనిషత్తులను బోధించిన లక్షకు పైగా
శ్లోకాలు రచించిన గురువులకు గురువైన
వేదవ్యాసుడు జన్మించిన రోజు
ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి
అందుకే అంటారు దీనిని *గురుపూర్ణిమ*
మరియు వ్యాస ‌పూర్ణిమ అని

ఇక్కడ *గు* అంటే అంధకారం,
*రు* అంటే పారద్రోలు అని అర్ధం
చీకటిని తొలగించి వెలుగును పంచేవారే గురువు
అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే వారే గురువు !

విష్ణు సహస్ర నామాలలోనూ
వ్యాస మహర్షి గొప్ప తనం కీర్తించ బడినది
"వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే"
"నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః!"

అలాంటి గురువులను
అంతటి మహత్తర శక్తి గల గురువులను
నిత్యం ప్రతి ఒక్కరూ స్మరించు కోవాలి
నమస్కరించు కోవాలి  సంస్కరించుకోవాలి
గురువుల గౌరవాన్ని కాపాడాలి!
 

No comments: