అంశం: నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?
ప్రతిస్పందన (సిగాచీ దుర్ఘటన)శీర్షిక: *అవినీతి భూతాలు*
అవకాశాలు సోపానాలైతే అవినీతి భూతాలు
కరాళనృత్యాలు చేస్తుంటాయి
తప్పు ఎవరిదైనా క్షణాలలో
ముప్పది తొమ్మిది నిండు ప్రాణాలు
గాలిలో కలిసి పోయాయి
మరెందరో క్షతగాత్రులయ్యారు
వారి కుటుంబాల ఆహాకారాలు నింగినంటాయి
వారు పెట్టుకున్న ఆశలు ఆశయాలు
ఆకాంక్షలు గంగలో కొట్టుకు పోయాయి
కోట్లాది విలువ చేసే సంస్థ యంత్రాలు
ముడి సరుకులు భవనాలు బూడిదై
మరణించిన కార్మికులకు ప్రతీకలుగా నిలిచాయి
పాశమైలారం సిగాచి విద్యుత్ ప్లాంట్ లో
రియాక్టర్/డయ్యర్ పేలుడు సంభవించిన
అగ్ని ప్రమాదం ముఖ్యమంత్రిని,ప్రధానమంత్రిని
కలచివేసింది
ఆరు నెలలు సంస్థను ముసివేయడంతో
బ్రతికున్న వందలాది కార్మికుల కుటుంబాలు
రోడ్డున పడ్డాయి
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే
ప్రయోజనం ఏమి ఉంటుంది
కోటి రూపాయలు ప్రకటిస్తే పోయిన ప్రాణం
తిరిగి వస్తుందా
మనిషి విలువను వెలగట్టడం ఎవరి తరం?
లంచాలకు మరిగిన అవినీతి భూతాలు
భద్రతా చర్యలు చెక్ చేయకుండా
ఆఫీసుల్లోనే కూర్చుని సంతకాలు చేసినవారు
మొదటి బాధ్యులైతే
ఉత్పత్తి మీద ఉన్న ఆసక్తి యంత్రాలపై కార్మికుల భద్రతపై లేకపోవడం యాజమాన్యం బాధ్యతనే
తప్పు ఎవరిదైనా పోయే ప్రాణం తమదే కాబట్టి
కార్మికులు రక్షణ చర్యలు తీసుకోక పోవడం
ఇంత భారీ ప్రాణనష్టానికీ కారణం కావచ్చు
ఏది ఏమైనా ఇకనైనా ప్రమాదకరమైన
సంస్థలలో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలి
అవినీతి అధికారులపై యజమానులపై
చర్యలు చేపట్టాలి
క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలి
No comments:
Post a Comment