నేటి కవిత:
తేది:09.07.25అంశం: పదాల కవిత
(చినుకులు చిరుగాలి చిగురాకు
చిద్విలాసం చిక్కదనం)
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
సమూహం సంఖ్య:158
కవిత సంఖ్య:189
హామీ: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు
శీర్షిక: ఓ సుందర వదనా!
అందమైన ఆహ్లాదకర ప్రదేశం ఎత్తెన ప్రాంతం
చుట్టూరా లోయలు ఎత్తైన వృక్షాలు
కనువిందు చేసే చల్లని *చిరు గాలులు*
మనోహరం ఆ వాతావరణం ఓ సుందర వదనా!
దేశంలో అతి శీతల ప్రాంతానికి ప్రతీక
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమే కదా!
అందులో సిమ్లా ఒక గొప్ప పర్యాటక ప్రాంతం
హోటళ్ళకు నివాసాలకు వానరులకు ఆవాసం
*చినుకులు* పడుతుంటాయి అచట నిత్యం
చేరువలోనే ఉంది "కుర్ఫీ" పర్యాటక ప్రాంతం!
సిమ్లా నుండి "కుర్ఫీ" వెళ్ళాలంటే దారిలో
రాళ్ళు రప్పలు లోయలు *చిగురాకులతో* తరువులు
బస్సులు కార్లు బైకులు పోలేవు అచటికి
గుర్రాల పైననే వెళ్ళాలి ఓ సుందర వదనా!
అద్భుతమైన ఆపిల్ చెట్లు పూల మొక్కలు
వైర్ రైడింగ్ లు వంతెనలు ఆటలు పాటలు
ఆహ్లాదకరమైన వాతావరణ దృశ్యాలు
*చిద్విలాసం* చేసే జడల బర్రెలు కుందేళ్ళు పక్షులు!
ఉలన్ బట్టల గుడారాలతతో వర్తకులు
ఆనంద డోలికల్లో పర్యాటకులు తిరుగుతూ
సాయంకాల సమయంలో *చిక్కదనం* చాయ్
త్రాగు తుంటే ఆహా ఏమి ఆ మధురానుభూతి
ఓ సుందర వదనా!
No comments:
Post a Comment