Tuesday, July 15, 2025


శీర్షిక: 

కొక్కుపట్టిన కోల్లు ఎన్ని కూతలైనా కూస్తాయి రాగాలు తీస్తాయి...

కోకిల పిల్లల గురించి గూళ్ళ గురించి
ఎన్ని రాగాలైనా తీస్తుంది...

ఎందుకంటే వాటి బరువు భారం మోసేది కాకులు కాబట్టి...

పడిశం పట్టిన ముక్కు కారుతూనే ఉంటుంది....

చిక్కు పడిన వెంట్రుకల కుచ్చు విసిగిస్తుంది...

జీవితంపై విరక్తి చెందిన వారు ప్రతి దేనినైనా విమర్శిస్తుంటారు....

కంఫర్టబుల్ జోన్ లో ఉన్న వారు గొప్పలు మాట్లాడుతుంటారు....

రెండింటినీ అధిగమించిన వారు వేదాంతం బోధిస్తారు....

మాటలు చెప్పడానికే ఆ నోరు గొప్పలు చెప్పుకోడానికే ఆ జోరు...

సమాజంలో ఉనికి కోసమే ఆ పోరు నీతులు వ్రాయడానికే ఆ కలం....

ఎదుటి వారికి వినిపించడానికే ఆ గళం...

ఆ పిదప మరుగున పడుతాయి కొంత కాలం....

ఏ తప్పూ చేయలేదని ఇవ్వరూ హామీ రేపు ఏ తప్పూ చేయనని చెప్పరూ పోనీ....
 
పప్పు బెల్లం కలిస్తేనే బొప్పట్లు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు...

ఒక్క వ్రేలుతో ఒరులను నిందింప వెక్కిరించు నిన్ను నీ మూడు వ్రేళ్ళు.....

దూరపు కొండలు నునుపు దగ్గరికి పోతే తెలుస్తుంది వాటి మెరుపు....

ప్రకృతి పూలకు సువాసనెక్కువ కృత్రిమ కాగితం పూలకు మెరుగులెక్కువ...

సృష్టిలో అందమైనది ప్రకృతి లోకంలో ఆనందాన్నిచ్చేది తరుణియే ...

మహిళా మణులు తప్పు చేసినా సమాజం నమ్మదు ...

పురుషులు తప్పు చేయకపోయినా నమ్ముతుంది సమాజం...

స్త్రీకి సానుభూతి అధికం సమాజంలో పురుషుడికి దండన అధికం సమాజంలో...

చట్టాలలో సహితం స్త్రీలకే వెసులుబాటు పురుషులకు అంతటా నగుబాటు...

ప్రతి పురుషుడి విజయం వెనుక  స్త్రీ హస్తం ఉందంటారు నాడు....

ప్రతి పురుషుడి పతనం వెనుక ఒక స్త్రీ ఉంటుంది నేడు...

నింగిలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం భూమిపైన చీకటి వెలుగులు ఉంటాయి ...

నేలలో ఆకలిదప్పులు స్వార్ధం ఉన్నంత కాలం....

మనుషులకు కష్ట సుఖాలు పాప పుణ్యాలు ఉంటాయి ....

నాడు ప్రపంచం అనంతం నేడు ప్రపంచం కుగ్రామం....

ముప్పది ఐదవ పెళ్లిలో తెలిసింది అమ్మడి మోసం...

సరదాగా అని చెప్పి రేప్ చేసి పడేశారు రాణులు
శ్రీ శైలం అడవులలో మగరాజును....

పెళ్ళైన సంవత్సరంలోనే నరకం చూపిస్తున్నారు వరులకు డబ్బు కొరకు విడాకులివ్వకుండా....

నేడు ఆడవారికి ముప్పది యేండ్లు దాటినా పెళ్లి ఊసెత్తడం లేదు...

నలుబది ఐదు దాటితే మోనోపాజ్  మగవారికి తొంబై దాటినా ఆండ్రో పాజ్ లేదు...

సృష్టిలో ఇలా అనేక విలక్షణమైన భేదాలు...

మోరీలకు కాలువలకు అడ్డుకట్టలు వేయగలం
నదులకు సముద్రాలకు కట్టలు వేయలేం...

సహజీవనానికి అదే కారణం దెబ్బ తింటారు ఉభయులూ అతి దారుణం ...

రేపు వివాహాలకు ముందే డాక్టర్ సర్టిఫికెట్లకు డిమాండ్ పెరుగునేమో ....

వీటి అన్నిటికీ పరిష్కార మార్గం రామాయణం మహాభారతం, భగవద్గీతను...

పాఠ్యపుస్తకాల్లో ముద్రించి పిల్లలకు బోధించడం ఒకటే మార్గం...!

No comments: