అంశం: అలజడి
శీర్శిక: *అశాంతి - ఆందోళన*
మనిషిలో అలజడికి ఆందోళనకు
అశాంతికి అసహనానికి కోపానికి
వాహక సాధనాలు పంచేంద్రియాలు!
శరీరానికి ఏదేని గాయమైతే చర్మం ద్వారా
శబ్ధం చెవుల ద్వారా దృశ్యం కనుల ద్వారా
వాసన ముక్కు ద్వారా ఆహరం నాలుక ద్వారా
క్షణాలలో మెదడుకు చేరుతుంది!
మెదడుకు విషయం చేరగానే
మనసులో అలజడి ప్రారంభమవుతుంది
ఆ విషయం ప్రాధాన్యతను బట్టి
మనసులో అశాంతి తీవ్రత పెరుగుతుంది
అర్ధం చేసుకునే శక్తి ఉంటే తీవ్రత తగ్గుతుంది!
అలానే నిశ్చలమైన నదిలోకి ఒక రాయిని
విసిరి నట్లయితే నీటిలో అలజడి ప్రారంభమై
వలయాల్లా నీటి తరంగాలు నదిలో
విసిరిన రాయి శక్తికి సమానమైన దూరం వెళ్తాయి!
మనిషిలో అశాంతికి అలజడికి వాహకాలు
పంచేంద్రియాలు అయితే కారణాలు అనేకం
అది ఏదో ఒక సంఘటన కావచ్చు
నష్టం కావచ్చు దృశ్యం కావచ్చు శబ్ధం కావచ్చు
ఇష్టం లేనిది కష్టమైనది ఏదైనా కావచ్చు!
ట్రాఫిక్ లో చిక్కుకున్నాము త్వరగా వెళ్ళాలి
మనసులో చిరాకు కోపం అసహనం
అలజడి ఆందోళన మొదలౌతాయి
ఇది మామూలే అని మనసు సర్ది చెప్పుకుంటే
అలజడి మటు మాయం
ఇలా ఏ సంఘటైనా కావచ్చు!
ప్రతి దానిని తేలికగా తీసుకో గలుగుతే
అలజడి అశాంతి ఆందోళన దూరమౌతుంది
మనసులో ప్రశాంతత నెలకొంటుంది
అదే భూతద్దంలో చూసుకుంటూ
పెంచుకుంటే *అశాంతి ఆందోళన!*
No comments:
Post a Comment