శీర్శిక: *తృప్తి ఆనందం సంతోషం *
తన కొరకా? పరుల కొరకా?
స్వార్ధమా? నిస్వార్థమా?
తనకు మాలిన ధర్మం చేయాలా వద్దా?
నిజంగానే పరుల కొరకే చేసుకుంటూ పోతే
చివరకు తనకు మిగిలేది ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలు కొందరిలో తొలుచక మానవు!
శిశువు జన్మిస్తూనే
తన తల్లి తండ్రులకు
మొక్క మొలకెత్తుతూనే
తన యజమానులకు తోట మాలీలకు
వాటికి తెలియకుండానే సంతోషాన్ని
ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి!
శిశువైతే తల్లిదండ్రులకు
మొక్కైతే యజమానులకు
మేము సృష్టి కర్తలం అనే భావనతో
తృప్తిని సంతోషాన్ని కలిగిస్తే
డాక్టర్లకు ఆయాలకు తోటమాలీలకు
ఇప్పటి వరకు వారు పడిన శ్రమకు
ఫలితం దక్కిందన్న ఆనందం కలుగుతుంది!
తృప్తి ఆనందం సంతోషం అనేవి
అమూల్యమైనవి అవి వెలకట్టలేనివి సంపదలు
వేటితోనూ తూచలేనివి కొలువ లేనివి
అంగట్లో కొందామన్నా ఎక్కడా దొరుకనివి!
అలానే మనిషిగా ఎదిగాక కూడాను
తాను చేసే ప్రతి పనిలో ప్రతి సేవలో
నీతి నిజాయితీ స్వచ్చత ధర్మం ఉండాలి
అది నిస్వార్థంతో కూడినదై ఉండాలి
శ్రీ రాముని వలె మాటకు కట్టుబడి
విలువలతో కూడిన జీవితం గడుపాలి
సమాజ శ్రేయస్సుకై ప్రజా హితమై జీవించాలి
అప్పుడే అతనిపై పై నమ్మకం ఏర్పడుతుంది!
సమాజ శ్రేయస్సుకై ప్రజా హితమై జీవించాలి
అప్పుడే అతనిపై పై నమ్మకం ఏర్పడుతుంది!
ఇక వారికి చివరికి మిగిలేది
తృప్తి ఆనందం సంతోషం
ఎనలేని గుర్తింపు గొప్ప గౌరవం
సమాజంలో పేరు కీర్తి ప్రతిష్టలు
చరిత్ర పుటల్లో స్థిర స్థాయిగా వారికో పేజి
ఎనలేని గుర్తింపు గొప్ప గౌరవం
సమాజంలో పేరు కీర్తి ప్రతిష్టలు
చరిత్ర పుటల్లో స్థిర స్థాయిగా వారికో పేజి
ఇంతకంటే ఏమి కావాలి వెళ్ళేటప్పుడు!
గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమహంస
స్వామి వివేకానంద డాక్టర్ అంబేద్కర్
డాక్టర్ అబ్దుల్ కలాం అందుకు చక్కని
ఉదాహరణలుగా చెప్పవచ్చు!
No comments:
Post a Comment