Monday, July 14, 2025

ఏక శిలా రథం - హంపి

అంశం: చిత్ర కవిత

శీర్షిక: ఏక శిలా రథం

దివి నుండి భువికి దిగి వచ్చిన
అద్భుత కళాఖండాలు
బ్రహ్మ సృష్టించిన శిలా చిత్రాలు
ఏక శిలా రథం సొగసులు

భారత దేశం లోని చతుష్షష్టి కళలలో
శిల్ప కళ వినూత్నమైనది
రాజులు శ్రీకృష్ణ దేవరాయలు
పెంచి పోషించిన గొప్ప కళ శిల్ప కళ

హంపీలో వేల సంవత్సరాల క్రితం
విఠలాచార్య దేవాలయం ముందు
ఏక శిలతో నిర్మించిన రథం మనోహరం
శిల్ప కళాకారుల అద్బుత కళా సృష్టికి ప్రతిరూపం

ఏక శిలా రథానికి ముందు వరుసలో
సుందరంగా నిర్మించిన రెండు గజరాజులు
చక్కగా నగిషీలు చెక్కిన రథ చక్రాలు
అందులో ధీటైన ఇరుసులు
క్రింది భాగాన చుట్టూరా నృత్య కారుల భంగిమలు
రథం చుట్టూ కళాకారులు నిర్మించిన స్థంభాలు
ద్రావిడ భాషలో రచించిన అక్షరాలు
నేటికీ చెక్కు చెదరని శిలా నిర్మాణాలు
భావి తరాలకు మార్గ దర్శకాలు
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు
నిలువెత్తు నిదర్శనాలు
జీవంతో ఉట్టిపడుతున్న కళాఖండాలు !
 

No comments: