సిద్ధప్ప వరకవి 122 వ జయంతి ఉత్సవం
సిద్ధిపేట జిల్లా కోహెడ్ మండలంగుండా రెడ్డి పల్లిలో జననం
జీవితమంతా ఎంతో ఘనం
అతడు వాక్కు వెలుగుల దీపం!
తెలంగాణ వేమన సుకవి
తెలంగాణ వైతాళికుడు తత్వకవి
ప్రసిద్ధ సిద్ధపురుషుడు సిద్ధప్ప వరకవి
జనులను చైతన్య పరిచిన రవి!
ఏడవ తరగతి వరకు హుడ్దూలో
మాతృభాష అయిన తెలుగులో
మాతృభాష అయిన తెలుగులో
23 కావ్యాలను , పదహేనవ యేటనే
జ్ఞానబోధిని రచించారు సీస పద్యాలలో
గొప్పగా ప్రసిద్ధి చెందారు చరిత్రలో!
వేమన తరువాత మేటి సహజ కవి
కాలపురుషుడు కారణ జన్ముడు
కులమతప్రాంత భాషలపై ఎక్కుపెట్టిన
సంఘసంస్కర్త మహాజ్ఞాని యోగి
తెలంగాణ బ్రహ్మంగారు!
రేపటి తరాలకు దిక్సూచి
నాటి జనజీవనానికి ప్రత్యక్ష సాక్షి
సత్యశోధకులకు వెలుగు దివ్వె
మమతానురాగాలకు మారుపేరు
తెలుగు నేల గర్వించే మహాకవి సిద్ధప్ప వరకవి!
No comments:
Post a Comment