*నేటి అంశం*చిత్ర కవిత*
శీర్షిక: *తెలంగాణ వేమన కవి సమ్మేళనం*
అది రవీంద్ర భారతి
ప్రభుత్వ సాహిత్య కార్యదర్శి మీటింగ్ హాలు
ప్రజా కవి జ్ఞాన బోధి తెలంగాణ వేమన
శ్రీ శ్రీ సిద్దప్ప వరకవి నూటా ఇరువది రెండవ
జయంతి సందర్భంగా
వారసులైన కుమ్మరులు ఏర్పాటు చేసిన
అద్భుతమైన కవి సమ్మేళన వేదిక!
కవి సమ్మేళన సామ్రాట్ కుసుమ ధర్మన్న
సమూహం వ్యవస్థాపక అధ్యక్షురాలు
డా. రాధా కుసుమ గారి అధ్యక్షతన
ప్రారంభ మాయే కవి సమ్మేళన మేళ
సాయంకాలం వేళ!
కవులు దర్పానాలు
ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులు
సమస్యల పరిష్కార రథసారధులు
కవులు దర్పానాలు
ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులు
సమస్యల పరిష్కార రథసారధులు
విషయ పరిజ్ఞాన శోధకులు
సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులు!
అలాంటి కవులను ఒక్కొక్కరిని పిలువగా
సిద్దప్ప వరకవి పైనను కులవృత్తులు మీదనూ
అద్భుతమైన కవితలను వినిపించిరి
మనోహరముగా పద్యాలను గానం చేసిరి!
కవులు ప్రతి కవితను పద్యాన్ని చదివాక
డా.రాధాకుసుమ గారి విశ్లేషణతో
పరవసించి పోయిరి కవులు గొప్పగా
అలా అలా కవి సమ్మేళనం పూర్తయ్యాక!
ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బాలా చారి గారు
డా.బడేసాబ్ గారు మరియు కుమ్మరి పెద్దల
సాహితీ మూర్తులు ఆసీనులయ్యాక
ప్రారంభ మాయే "అఖిల భారతీయ కుమ్మరి
శాలివాహన ప్రజాపతి కుంభకార్ సంఘ్" సభ!
కుమ్మరి సంఘం కార్యదర్శి శ్రీ శంకర్ గారు
శ్రీ శ్రీ సిద్దప్ప యోగి గురించి చక్కగా వివరించారు
తదుపరి ప్రణాళికలను తెలియజేశారు
ఆ తదుపరి వక్తలు గొప్పగా ఉపన్యసించారు!
కవి సమ్మేళన హాలులో పూర్వ కవులందరి
చిత్రాలు ఉన్నాయి తెలంగాణ వేమన అయిన
సిద్దప్ప వరకవి చిత్రం లేదని శ్రీ శంకర్ గారు
విన్నవించగా!
ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బాలా చారి గారు
ఉపన్యసిస్తూ ఇకనుండి జులై క్యాలెండర్ లో
సిద్దప్ప కవి చిత్రం తప్పక ఉంటుందనీ
హాలులో వరకవి చిత్రం ఏర్పాటు చెస్తామనీ
వారు రచించిన ప్రజోపయోగకర పుస్తకాలను
ముద్రించి వెలుగు లోకి తెస్తామని హామీ ఇచ్చిరి!
సిద్దప్ప వరకవి పరిశోధకురాలు
సుజాతమ్మ గారు చక్కని నిర్వచనాల కవితను
వినిపించారు
విచిత్రం ఏమిటంటే హరిజనోద్ధరణకు
నడుం బిగించి అనేక గ్రంధాలను రచించి
గాంధీజీనే తమ వాడలకు రప్పించి
సహపంక్తి భోజనాలు చేయించినట్టి
గొప్ప కవి "కుసుమ ధర్మన్న" కవి చిత్రపటం
హాలులో లేక పోవడం, అధికారిక
క్యాలెండర్ లో చోటు చేసుకోలేకపోవడం
శోచనీయం ఆలోచించాల్సిన విషయం
పూర్వ గొప్ప కవులందరికీ ఒకే రీతిలో
గౌరవం దక్కడం అనేది సముచితం
ఇదే కవులు చూపే పరిష్కార మార్గం!
సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులు!
అలాంటి కవులను ఒక్కొక్కరిని పిలువగా
సిద్దప్ప వరకవి పైనను కులవృత్తులు మీదనూ
అద్భుతమైన కవితలను వినిపించిరి
మనోహరముగా పద్యాలను గానం చేసిరి!
కవులు ప్రతి కవితను పద్యాన్ని చదివాక
డా.రాధాకుసుమ గారి విశ్లేషణతో
పరవసించి పోయిరి కవులు గొప్పగా
అలా అలా కవి సమ్మేళనం పూర్తయ్యాక!
ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బాలా చారి గారు
డా.బడేసాబ్ గారు మరియు కుమ్మరి పెద్దల
సాహితీ మూర్తులు ఆసీనులయ్యాక
ప్రారంభ మాయే "అఖిల భారతీయ కుమ్మరి
శాలివాహన ప్రజాపతి కుంభకార్ సంఘ్" సభ!
కుమ్మరి సంఘం కార్యదర్శి శ్రీ శంకర్ గారు
శ్రీ శ్రీ సిద్దప్ప యోగి గురించి చక్కగా వివరించారు
తదుపరి ప్రణాళికలను తెలియజేశారు
ఆ తదుపరి వక్తలు గొప్పగా ఉపన్యసించారు!
కవి సమ్మేళన హాలులో పూర్వ కవులందరి
చిత్రాలు ఉన్నాయి తెలంగాణ వేమన అయిన
సిద్దప్ప వరకవి చిత్రం లేదని శ్రీ శంకర్ గారు
విన్నవించగా!
ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బాలా చారి గారు
ఉపన్యసిస్తూ ఇకనుండి జులై క్యాలెండర్ లో
సిద్దప్ప కవి చిత్రం తప్పక ఉంటుందనీ
హాలులో వరకవి చిత్రం ఏర్పాటు చెస్తామనీ
వారు రచించిన ప్రజోపయోగకర పుస్తకాలను
ముద్రించి వెలుగు లోకి తెస్తామని హామీ ఇచ్చిరి!
సిద్దప్ప వరకవి పరిశోధకురాలు
సుజాతమ్మ గారు చక్కని నిర్వచనాల కవితను
వినిపించారు
విచిత్రం ఏమిటంటే హరిజనోద్ధరణకు
నడుం బిగించి అనేక గ్రంధాలను రచించి
గాంధీజీనే తమ వాడలకు రప్పించి
సహపంక్తి భోజనాలు చేయించినట్టి
గొప్ప కవి "కుసుమ ధర్మన్న" కవి చిత్రపటం
హాలులో లేక పోవడం, అధికారిక
క్యాలెండర్ లో చోటు చేసుకోలేకపోవడం
శోచనీయం ఆలోచించాల్సిన విషయం
పూర్వ గొప్ప కవులందరికీ ఒకే రీతిలో
గౌరవం దక్కడం అనేది సముచితం
ఇదే కవులు చూపే పరిష్కార మార్గం!
No comments:
Post a Comment