అంశం: చిల్లర దేవుళ్ళు
శీర్శిక: *కూటి కోసం కోటి విద్యలు*
"కూటి కోసం కోటి విద్యలు" అన్నట్లు
స్వాతంత్ర్యానికు పూర్వం చూసినా
ఆ తర్వాత నుండి నేటి వరకు చూసినా
దొరలు జామీందారులు రజాకార్లు
నిజాం నవాబు నుండి
నేటి కొందరు బాబాలు మోసగాళ్ళు
అంతర్జాలంలో దోచుకునే ముసుగు దొంగల వరకూ
అనేక మంది తారసపడుతేనే ఉంటారు
మోసాలు చేస్తూనే ఉంటారు
అనునిత్యం ఎరుకతో ఉండాలి
ఎవరి సమర్ధత బట్టి వారు జాగ్రత్తపడాలి
లేదంటే బ్యాంకు అకౌంట్లను ఊడ్చేస్తారు!
నేటి కాలంలో మేమే దేవుళ్ళమని
కొందరికి ఉంటున్నది ఎంతో కొంత గర్వం
చేసుకుంటారు కొంత కాలం మహా పర్వం
ఆ తరువాత కోల్పాతారు సర్వం
గుర్తుకు వస్తుంటది అప్పుడు పూర్వం!
అడుక్కునే ఎవరినైనా ప్రోత్సహించవద్దు
డబ్బులిచ్చివారిని సోమరులను చేయవద్దు
బారు షాపుల్లో డబ్బు పోయనీయవద్దు
ఆస్తులు కూడబెట్టే వారికి వేయవద్దు
అర్హులైన బిచ్చగాళ్ళకు ఇవ్వడమే ముద్దు!
No comments:
Post a Comment