*నేటి అంశం*సామెతల కవిత*
*1.బూడిదలో పోసిన పన్నీరు**2* *ఇంట గెలిచి రచ్చ గెలువు*
శీర్షిక: పరిపూర్ణ వ్యక్తిత్వం
చేసే పని చేసే సేవ చేయు సహాయం
ఉపయోగ కరంగా అర్ధ వంతంగా
సమర్ధవంతంగా లేకుంటే
అప్పుడు అన్నియూ *బూడిదలో పోసిన*
*పన్నీరు* అవుతాయి
విద్యార్థులకు చెప్పే పాఠాలు సంస్కారం
వినయ విధేయతలు పెంపొందించే విధంగా
వారి అభివృద్ధికి విజ్ఞాన సముపార్జనకు
ఉపయోగ పడక పోతే చదివిన చదువులు
వెలకట్టలేని సమయం డబ్బు వయసు శ్రమ
తల్లి తండ్రుల ఆశలు పిల్లల ఆకాంక్షలు
అన్నియు బూడిదలో పోసిన పన్నీరే
అవుతాయి పనికి రాకుండా పోతాయి
"ఇంట్లో బానిస బయట బాదుషా" లా
"ఇంట్లో ఈగల మోత బయట గజ్జెల మోత" లా
కాకుండా
"ఇంట గెలిచి రచ్చ గెలువు" అ్నట్లుగా ఉండాలి
ముందు ఇంట్లో చక్కగా నడుచుకోవాలి
ఇంట్లో కుటుంబంలో ఎవరికి
ఏ ఇబ్బందీ కలుగకుండా చూసుకుని
బయట సమాజంలో నీతులు బోధించాలి
కావాల్సిన సహాయం చేయాలి మేలు చేకూర్చాలి
కానీ ఇంట్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ
బయట సభ్యతగా ప్రవర్తించడం సరికాదు
ఇంటా బయటా ఒకే రీతిలో
"పరిపూర్ణ వ్యక్తిత్వం"తో జీవనం సాగించాలి!
No comments:
Post a Comment