అంశం: నైతిక పతనం
శీర్శిక: *దిగజారి పోకూడదు*
సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో
మానవ జన్మ ఉత్కృష్టమైనది ఉన్నతమైనది
మహోన్నతమైనది
మానవ జన్మ ఎత్తినప్పుడు
దానిని సార్ధకం చేసుకోవాలి కానీ
చేజేతులా పాడు చేసుకోకూడదు
విలువను దిగజార్చుకోకూడదు
మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది
సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది
చెడు పనులు చేస్తే చెడ్డ పేరు వస్తుంది
సమాజంలో ఖలుడిగా ముద్ర పడిపోతుంది
మనిషి సంఘజీవి అనేది నగ్నసత్యం
సమాజంలో జీవించే టప్పుడు
నీతి నిజాయితీ నమ్మకం సత్యం ధర్మం
అను గుణాలతో మెదులుకోవాలి
నా జీవితం నా ఇష్టం అంటే కుదరదు
ఎప్పుడైతే ఎదుటి వారితో చేసే
ఆర్ధిక వ్యవహారాలు లేదా మరో విషయంలో
నీతి నిజాయితీ నమ్మకం కోల్పోతారో
అప్పుడు వారు నైతికంగా పతనమైనట్లుగానే భావించాలి
నీతి నిజాయితీ నమ్మకం అనేవి
కేవలం మనుష్యులకు మాత్రమే కాదు
ఈ ప్రపంచంలో ప్రజలతో ముడి పడి ఉన్న
ప్రతి ఒక్క సంస్థకు బ్యాంకులకు
ఇన్స్యూరెన్స్ కంపెనీలకు హాస్పిటల్స్ కు
ప్రభుత్వాలకు వర్తిస్తాయి
కేవలం నీతి నిజాయితీ నమ్మకాల మీదనే
కొన్ని లక్షల కోట్ల వ్యాపారాలు
జరుగు తున్నాయి
ఇలాంటి పరిస్థితులలో మనిషి
నమ్మకం కోల్పోతే జీవించడం దుర్లభం
మనిషి ఒక మాట ఇస్తే
దానికి కట్టుబడి ఉండాలి
సత్యం ధర్మాన్ని పాటించాలి
నిబద్ధతతో క్రమశిక్షణతో ఉండాలి
నీజాయితీ గా మెదులుకోవాలి
నమ్మిన వారిని మోసం చేయకుండా
నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
బ్రతికిన నాలుగు కాలాలైనా నందిలా బ్రతకాలి
నైతికంగా పతనమై దిగజారి పోయి
సమాజంలో చులకన కాకూడదు
విలువలకు తిలోదకాలిచ్చి జీవచ్ఛవంలా గడుపకూడదు !
_ మార్గం కృష్ణ మూర్తి
No comments:
Post a Comment