అంశం: ఋతువు - క్రతువు
శీర్శిక: కాలాలు - వేడుకలు
మనిషి మాటలను బట్టి
మనిషి గుణము తెలియునటులే
కాలం ఋతువులను బట్టి
కాలం మార్పులు తెలియును
ఋతువు అనేది సంవత్సరం కాలంలో
ఒక భాగాన్ని సూచిస్తే
క్రతువు అనేది కాలం ఏదైనా ఒక వేడుకను
పండుగను ప్రభోజనాన్ని సూచించు
సంవత్సరం కాలంలో నుండు
ప్రకృతిని మార్చేటి ఆరు ఋతువులు
వసంతం గ్రీష్మం వర్ష శరదృతువు
హేమంతం శిశిర ఋతువులు
వసంత ఋతువులో ఆహ్లాదకరం
గ్రీష్మ ఋతువులో ఎండా వేడిగాను
వర్షం ఋతువులో వర్షాలు మెండు
శరదృతువులో చల్లగాను హేమంతంలో శీతలం శిశిరంలో మరింత చల్లగా నుండు
కాల ప్రభావాలను అర్థం చేసుకుంటూ
వాటిని అధిగమించడానికి
కాల పరిస్థితులను తట్టుకోడానికే చేసే
పండుగలు వేడుకలే మ్రొక్కులే *క్రతువులు*
కలరా మసూచి వ్యాధులు రాకుండా బోనాలు
ఆషాఢం ఆశుభాలకు మూలమని కొత్త
దంపతులను వేరుగా నుంచడం
శరదృతువులో కౌరవులపై పాండవుల
గెలుపుకు సూచికగా దసరా
నరకాసురుడి రావణుడి వధకు సూచికగా
దీపావళి
తీరొక్క పువ్వుతో బ్రతుకమ్మ
కొత్తపంటల సూచికగా సంక్రాంతి!
జీవితంలో కష్టనష్టాలు బాధలు దుఃఖాలు
సంతోషాలు ఉంటాయని
పులుపు చేదు కారం తీపి అనుభవాలను
గుర్తుచేసే ఉగాది
ఆకులు కాయలతో వినాయకుడిని
ఇలా ప్రతి ఋతువులో పండుగలు పూజలు హోమాలు మరెన్నింటినో
పరిచయం చేస్తుంది కాలం
పూజలు చేస్తారు జనం
ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయం!
కాలాన్ని బట్టి ప్రకృతిని ఆరాధిస్తే పురోగతి
కాదు కూడదంటే జనులకు పట్టును అధోగతి!
No comments:
Post a Comment