*అంశం*: *కొత్త వేకువ కోసం*
శీర్షిక: *నవ వసంతం కోసం*
క్షణంక్షణం ప్రతిక్షణం
నిమిషంనిమిషం ప్రతి నిమిషం
గంటగంటా ప్రతి గంటా
రోజు రోజు ప్రతి రోజూ ప్రకృతిలో
విశ్వంలో ఎన్నో మార్పులు
మరెన్నో చిత్ర విచిత్రాలు!
కొత్త వేకువ కోసం మార్పుకోసం
ఎదురు చూస్తూ నిరీక్షణ
ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ ఘడియ
చకోర పక్షిలా ఇంకెంత కాలం
ఈ ఎదురు చూపులు!
పసుపు పారాణి ఆరక ముందే
యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి
వచ్చిన బంధు మిత్రులు కూడా
తరలి వెళ్ళ లేదు!
కొత్త పుస్తెలు కుచ్చలేదు
పదహారవ పండుగ కూడా జరుగలేదు
ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టలేదు
పిలుపు అందుకున్న అరక్షణం ఆగకుండా
ఆడ కత్తెరలో పోక చెక్కలా నలిగి పోతూ
తరలి పోయే భర్త దేశ రక్షణకు
కట్టుకున్న భార్య మనసు కలచి వేసినా
పట్టదాయే తనకు
వలచి వలచి ఏడ్చినా చేరదాయే
అతని మూగ చెవికి
బార్డర్ లో ఎలా ఉండెనో ఏమో
అతని బాధలు నాకు తెలియకుండే
నా మానసిక బాధలు దుఃఖాలు
తనకు తెలియకుండే!
శని నా లోనా అతని లోనా?
దేవుడు శిక్ష నాకు వేశాడా తనకు వేశాడా?
లేదు ఇద్దరికీ శిక్ష వేశాడు
ఏమో కర్మ ఫలమేమో!
క్షణమొక యుగంలా గడుస్తుంది
కొత్త వేకువ కోసం *నవ వసంతం కోసం*
ఎదురు చూస్తూ!
No comments:
Post a Comment