Tuesday, July 15, 2025

దాస్యం సేనాధిపతి

తేది: 23.07.25

*శ్రీమాన్ దాస్యం సేనాధిపతి గారు  

70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా:

శీర్షిక: *కవితా బ్రహ్మ*

ప్రక్రియ: మణి పూసలు

01.
లేఖల రచయిత దాస్యం
వ్యాస రచయితగ దాస్యం
"కవితా బ్రహ్మ" యే కాదు
మహా విజ్ఞాని దాస్యం!

02.
అతి నిరాడంబరుడు
మృధుస్వభావి అతడు
కవుల చైతన్యపరిచే
ప్రతిభ గలగినవాడు!

03.
తెలంగాణ రాష్ట్రమున
అక్టోబరు నెల ఐదున
కవి సేనాధిపతి గారు
జన్మించిరి నిర్మల్ న!

04.
నాన్న వెంకట స్వామియు
తల్లి  శాంతాదేవియు
మన్ననలను పొందిరి
గొప్ప కీర్తి గడించియు1

05.
ఇష్ట భాష తెలుగనేది
జాతి గౌరవం అనేది
దాస్యం గారికి ఉండును
సాధించడమూ అనేది!

06.
ఉన్నత విధ్యాధికుడు
కామర్స్ ను చదివినాడు
బహు భాషా వేత్తగా
మన్ననలను పొందాడు!

07.
కవిత్వ సంస్కరణ వాది
మంచి మానవతావాది
వెలకట్ట లేనటువంటి
భారతీయ సాహితి నిధి!

08.
సమీక్ష కుడు విమర్శకుడు
పరిణత ఉపన్యాసకుడు
"నానీల సంపుటి" ని
"దిక్సూచి"లను వ్రాశాడు!

09.
ఆలోచనలు ఉన్నతము
ఎల్లలనూ దాటె గుణము
సేనాధిపతి ఆశయమె
విజ్ఞానాన్ని పంచడము

10.
తెలుగు జాతి కోవెలగా
జగతియందు పున్నమిగా
వర్ధిల్లు చుండునెపుడు
సాహిత్య చిరు దివ్వెగా!

11.
కాళోజి పురస్కారము
దాశరథి పురస్కారము
లెన్నియొ పొందె వాటితో
జాషువా పురష్కారము!


గురువు గారు శ్రీమాన్ దాస్యం సేనాధిపతి గారికి
70 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు

"శతమానం భవతిః శతాయు పురుష
శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి"

No comments: