Thursday, July 24, 2025

వయసు మనసు

*నేటి అంశం* *వయస్సు - మనస్సు*


శీర్షిక: *రథానికి రెండు చక్రాలు*

వయసు శరీరానికి సంబంధించినది
మనసు బుద్ధికి సంబంధించినది
వయసు ప్రత్యక్షంగా కనబడేది
మనసు కాగడా పట్టి వెతికినా కనబడనిది
పసిఫిక్ మహాసముద్రం కంటే లోతైనది!

వయసు మనసు అనేవి రథానికి
రెండు చక్రాల వంటివి
ఏ చక్రం ఆగినా రథం తిరగడం ఎంత కష్టమో
వయసులో మనసులో హెచ్చు తగ్గులుంటే
మనిషి జీవితం సాఫీగా సాగడం అంతే కష్టం!

వయసు పాటు మనసు పెరుగడం సహజం
వయసు పెరిగి మనసు పెరగక పోతే
అది బుద్ధి మాంద్యం
వయసు తక్కువ ఉండి మనసు జ్ఞానం
అధికంగా ఉంటే బుద్ది పరిణతి చెందిన
విజ్ఞానులు అంటారు!

చిన్న పిల్లల్లో దొడ్డ మనసు పెద్ద జ్ఞానం ఉంటే
వారిని సరస్వతీ పుత్రులు గానూ
పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు!

లోక జ్ఞానం గానీ సంకుచిత బుద్ధి లాంటి అవగుణాలు అవలక్షణాలు ఉన్నను
లింగ వివక్ష లేకుండా వీరికి వయసు పెరిగింది
గానీ బుద్ధి పెరుగు లేదని అంటారు!

బాల్యం కౌమార్యం యవ్వనం వృద్ధాప్యం
వయసులో దశలుగా చెప్పవచ్చు!

ఋషులను గౌతమ బుద్ధుడు
స్వామి వివేకానందలను వయసుకంటే భిన్నంగా
పరిణతి చెందిన వారుగా పేర్కొనవచ్చు
 

No comments: