Friday, July 25, 2025

ఆరోగ్యం వెలకట్టలేని సంపద

అంశం: ఆహారం - ఆహార్యం

శీర్శిక: *ఆరోగ్యం వెలకట్టలేని సంపద*

మనిషి ఆరోగ్యంగా ఉంటేనే
ఏ పనైనా చేయవచ్చు ఏదైననూ సాధించవచ్చు
అందుకే అన్నారు పెద్దలు ,
*ఆరోగ్యమే మహాభాగ్యం* అని

చక్కని పౌష్టికాహారం సమతుల ఆహారం
తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
తాజా కూరగాయలు ఆకుకూరలు
పప్పుధాన్యాలు కాలాను సారంగా లభించే
పండ్లు  చిరుధాన్యాలు మొలక ధాన్యాలును
తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని
అందాన్ని కాపాడు కోవడం చాలా సులభం

స్వార్ధం ఈర్ష్య అసూయలను తగ్గించుకుని
రందులను బాధలను దూరం పెట్టి
రోజు మెడిటేషన్ వ్యాయామం నడక లాంటివి చేసిన
ఆరోగ్యంగా జీవించవచ్చు

ఉప్పు కారం తగ్గిస్తే బిపి షుగర్ మటుమాయం
శీతల పానీయాలు మద్యపానం మాంసం
సిగరెట్లు చుట్టలు గుట్కాలు జంక్ ‌ఫుడ్స్
ఆపి వేస్తే ఆయుష్షు పదేళ్ళు పెరుగుతుంది

ఆహారం వేరు ఆహార్యం వేరు
ఆహారం ఆరోగ్యానికి సంబంధించిన దైతే
ఆహార్యం శరీర ధారుఢ్యానికి సంబందించినది
మనిషి బాహ్య అందం శరీర ధారుఢ్యం
ఇవి తాత్కాలికం అశాశ్వతం

వస్త్ర ధారణ నగలు ధరించడం
బాహ్య సౌందర్యం గంభీరత్వం సూటుబూటు
తమకు తాము గొప్పగా ప్రదర్శించడం
నడక మాట తీరు అన్నియు ఆహార్యమే

ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయాలి గానీ
ఆహార్యం కోసం చేయకూడదు
డాబుసరి అని నిజాలు తెలిసిన రోజు
చిప్పకూడే గతి అవుతుంది
*ఆరోగ్యం వెలకట్టలేని సంపద*
ఎవరూ దొంగిలించ లేని గొప్ప సంపద!

No comments: