Tuesday, July 15, 2025

సంస్కారం యశస్సు పెంచుతుంది

*అంశం*- *కవితార్చన*

*చదువు -సంస్కారం*

శీర్షిక:  *సంస్కారం యశస్సు పెంచుతుంది*

మానవులకు చదువు సంస్కారం రెండూ  ముఖ్యమే జీవితంలో...

చదువు సంస్కారానికి అవినాభావ సంబంధం ఉంది రెండూ కవల పిల్లలు...

చదువు జ్ఞానాన్ని పెంచుతే సంస్కారం యశస్సు పెంచుతుంది...

చదువు లేనివాడు వింత పశువు సంస్కారం లేని వాడు వింత కసువు...

పేరు కీర్తి ప్రతిష్టలు సాధించాలంటే చదువుంటేనే సరిపోదు....

చదువుతో పాటు మనిషి ఉత్తమ సంస్కార లక్షణాలను అలవర్చుకోవాలి...

చదువు పాఠశాలలో గురువుల బోధనల ద్వారా  లభిస్తుంది....

సంస్కారం మొదటి గురువులైన తల్లిదండ్రులు పెద్దల నుండి లభిస్తుంది...

సంస్కారం  కొందరికి గురువుల నుండి సమాజం గ్రంధ పఠనం ద్వారా లభిస్తుంది...

ఎన్ని చదువులు డిగ్రీలు ధనం ఉన్నా సంస్కారం లేకపోతే...

గర్వం తలకెక్కి  సర్వం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది...

భాషలోని అక్షరాల ద్వారా చదువు జ్ఞానం విజ్ఞానం లభిస్తే...

మానవత్వం లోని మాటల ద్వారా వినయం వివేకం విధేయత అలవడుతుంది...

సేవాగుణం దానగుణం సత్యం ధర్మగుణం పెద్దలపై గౌరవం ఏర్పడుతుంది...

నిస్వార్థం నిజాయితీ వంటి సుగుణాలతో కూడిన సంస్కారం బోధపడుతుంది...

చదువు సంస్కారం వలన వ్యక్తి యశస్సు దేశ గౌరవం పెరుగుతుంది...

ప్రతి పాఠశాలలో భగవద్గీతను నేర్పిస్తే విద్యార్థులలో సంస్కారం పెరుగుతుంది...

చరిత్రలో యశస్సు గల ఎవ్వరినీ పరిశోధించినా భగవద్గీత అవగాహన ఉన్నవారే...

రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద  బుద్ధుడు కలాం  చక్కని ఉదాహరణలు...
 

No comments: