శీర్షిక: సవ్యసాచి- దాశరథి కృష్ణమాచార్య
సీ.
సాహిత్య శిఖరము సంస్కార సుగుణుడు
స్వాతంత్ర్య యోధుడు సవ్య సాచి
నరులకన్నీళ్ళను నగ్ని ధారగ మార్చి
దాశరథిమహర్షి దయను చూపె
నాతెలంగాణయే నాకోటి రతనాల
వీణని ధైర్యంగ విశదపరిచె
నివురుతో కప్పిన నిప్పువలె నిజాము
మెడలును వంచియు హడల గొట్టె!
తే.గీ.
చిన్న గూడూరు జన్మ విశేష పరిచి
మంచి గ్రంధముల రచించి మంచి పెంచె
తెలుగు నేలకు ఎంతయో దిగులు దీర్చె
బిరుదు లెన్నియో పొందిన మురువ కుండ
దాశ రథికృష్ణ మాచార్య ధన్యు డాయె!
No comments:
Post a Comment