Thursday, July 17, 2025

మిశ్ర గతి గజల్ (7+7+7+7)*

అంశం: మిశ్రగతి గజల్ (7+7+7+7)



కలిసి మెలిసే  తోటలోనా *తిరుగుతామని  తెలిసి పోయెను*
అలసి సొలసీ మంచె కాడా *పాడుతామని తెలిసి పోయెను*

సుందరమైన కొలను లోనీ  కమల పూలే వికసించెనోయ్
కమల పూలే  దేవుడి పాద  *పద్మములకని తెలిసి పోయెను*

చెరువులోనే  చేప పిల్లలు  పెరుగుతాయని తెలిపెజనులోయ్
చేప పిల్లల  ప్రభుత్వాలే  *పెంచుతాయని  తెలిసి పోయెను*

కునుకు పడితే మదిలో కలలు వస్తుండునని వినిపించెనోయ్
కనుల నిండా పండు వెన్నెల  *కురుస్తుందని తెలిసిపోయెను*

ఓయి  కృష్ణా!  జాబిలిలోన నల్ల మచ్చని అనుకుంటినోయ్
నల్లనిమచ్చ చంద్రుని పైన  *కందకాలని  తెలిసి పోయెను*
 

No comments: