Thursday, July 31, 2025

జాతీయ జెండా -2 దేశ భక్తి గీతం

అంశం: భారత దేశ ఔన్నత్యం

శీర్షిక: జాతీయ జెండా! (దేశ భక్తి గీతం)

ఎగరవే.... ఎగరవే....జాతీయ జెండా
ఎగరవే ....ఎగరవే... మువ్వొన్నెల జెండా
ఎగరవే ...ఎగరవే ... వజ్రోత్సవ జెండా!

ఝాన్సీ  అల్లూరి నేతాజీ గాంధీ నెహ్రూ అంబేద్కర్
భగత్ సర్ధార్ మరెందరో  త్యాగ మూర్తుల త్యాగఫలం!    "ఎగరవే"

ఇంటింటా ప్రతి యింటా వాడవాడన  ప్రతి బడినా
వీది వీదినా ప్రతి మదినా..
దేశం రాష్ట్రాల నలుమూలలా!       "ఎగరవే"

ప్రజలకు ధైర్యాన్నిచ్చు జెండా
జనులకు శక్తి నిచ్చు జెండా
యువతకు ఊపిరి నిచ్చు జెండా
భారతీయులలో ఐఖ్యత పెంచు జెండా!  "ఎగరవే"

కుల మతాలు నీకు లేవు పేద ధనికకు తావు లేదు
ప్రాంతీయతలు నీకు లేవు పార్టీల సంకెళ్ళు లేవు!         "ఎగరవే"

ఏ దేశాన ఎగిరినా ఎనలేని గౌరవం
ఏ కాలాన ఎగిరినా మెండుగ ఆనందం
ఎక్కడ ఎగిరేసినా .. ఉన్నతం నీ భావం
ఎప్పుడు ఎగరేసినా..ఉన్నతం నీ స్వరూపం! "ఎగరవే"

దేశ గౌరవం పెంచను దేశ భక్తిని పెంచను
దేశ కీర్తిని పంచను దేశ ఐఖ్యతను నిలుపను
యువత శక్తిని పెంచను!   "ఎగరవే"

పింగళి వెంకయ్య రూపుదిద్దిన
మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా
కాశాయం శౌర్యానికి, తెలుపు శాంతికి
ఆకుపచ్చ పాడిపంటలకు
ఐఖ్యతకు ,శాంతికి చిహ్నాలు అశోకధర్మచక్రం  "ఎగరవే"

త్యాగమూర్తులను గుర్తుచేస్తూ...
నవ తరాలను మేల్కొల్పుతూ..!     "ఎగరవే"

No comments: