Wednesday, July 16, 2025

వైరాగ్యం నైరాశ్యం

అంశం: వైరాగ్యం

శీర్శిక: నైరాశ్యం

ఎప్పుడూ చలాకిగా సరదాగా ఉండేవాడు
ఏమైందో ఏమో ఏమీ మాట్లాడటం లేదు
ఏదీ తినడడం లేదు త్రాగడం లేదు
నలుగురితో కలవడానికి ఇష్టపడటం లేదు!

దేనిపైనా ఆసక్తి లేదంటాడు
సమస్య ఏమిటనినా సమాధానం చెప్పడు
చిరాకు కోపం అసహనం అదోలా చూపులు
వేటిపైనా తనకు కోరికలు లేవంటాడు
ఏదో పోగొట్టుకున్న వాడిలా నైరాశ్యంతో ఉంటాడు!

అక్కడక్కడా ఇలా ఉంటారు కొందరు
ఇలాంటి వారిని వైరాగ్యం తో
బాధ పడుతున్నవారిగా భావించాలి
వైరాగ్యంలో మరోకోణం త్యాగం!

వైరాగ్యానికి కారణాలు అనేకం
ఆప్తులు దూరమవడం కావచ్చు
ఉద్యోగం పోవడం కావచ్చు
అనుకున్నది సాధించ లేదని కావచ్చు
నేటి సమాజం తీరు చట్టాల తీరు నచ్చక కావచ్చు
తనను ఎవరూ గుర్తించడం లేదని కావచ్చు!

వైరాగ్యం జీవితంపై విరక్తి చెంది కావచ్చు
లేదా జీవితంలో ఏదో సాధించాలని కావచ్చు
ఆధ్యాత్మిక దిశగా ప్రయాణిస్తూ
అన్నింటినీ త్యజిస్తారు త్యాగం చేస్తారు !

వేటి పైనా ఆసక్తి చూపరు
వేటిని తినాలని  చూడాలని గానీ ఉండదు
భౌతిక సుఖాలకు దూరంగా ఉంటారు
అరిషడ్వర్గాలైన కామక్రోద మోహ లోభ
మద మాత్సర్యములను వదిలేస్తారు
ఒక వేదాంతిలాయోగిలా ప్రవర్తిస్తారు!

వైరాగ్యమే  మనిషి నైరాశ్యం
ఒకటి మానసికమైన వ్యాకులత అయితే
రెండవది ఆధ్యాత్మిక మైనది
మొదటిది మనిషి పతనానికి దారి తీస్తే
రెండవది యశస్సు పెంచడానికి దోహదపడుతుంది! 

No comments: