అంశం: గురు పూర్ణిమ
శీర్షిక: వేదవ్యాసుడుప్రక్రియ:ఇష్ట పదులు
ఆషాఢమాసమున యానందముతోడను
వచ్చును గురుపూర్ణిమ వడివడిగానుజగతి
మహాభారతములను మనసు బెట్టివ్రాసిన
వేద విభజన తోడ వేదవ్యాసుడయ్యె
జన్మించిన రోజునె జగతికి వెలుగు వచ్చె
ఆషాఢ పౌర్ణమిన ఆవిర్భవించెనని
చరిత్ర చెబుతున్నది చక్కగాను జనులకు
గురుపూర్ణిమ రోజున గురువునుస్మరించిన
గురువుకు మ్రొక్కినను గురువులు తృప్తిచెందు
జ్ఞానమును పొందెదరు జ్ఞాన వంతులౌదురు!
No comments:
Post a Comment