అంశం: వయసు - యశస్సు
శీర్శిక: *ధనం కంటే గొప్పది జ్ఞానం*
వయసు వేరు యశస్సు వేరు
కష్టపడకుండానే పెరిగేది వయసు
కష్టపడితేనే వచ్చేది యశస్సు
కాలం గడుస్తే పెరిగేది వయసు
మనసు బుద్ధి పెరిగితేనే పెరిగేది యశస్సు
వయసు నిత్యం పెరిగేది
యశస్సు ఏ దశలోనైనా లభించేది!
వయసు మనిషి శారీరక ఎదుగుదల
యశస్సు మనిషి మానసిక ఎదుగుదల
వయసుతోపాటు బుద్ధి పెరుగితే కీర్తి ప్రతిష్టలు
బుద్ధి పెరుగుకపోతే మానసిక వికలాంగులు!
బ్రహ్మ అందరినీ ఒకే రకంగానే సృష్టిస్తాడు
కానీ పూర్వం తండ్రి తాతలు చేసిన
దుష్ట కర్మల ఫలితాను సారం
చిత్ర గుప్తుని వద్ద ఉన్న చిట్టా ప్రకారం
పాప గ్రహాలైన రవి కుజ శని రాహు కేతువుల
లగ్నాలలో కొందరిని
ఘడియలతో సహా లెక్క గట్టి జన్మింప జేస్తాడు
అవియే సంచిత ప్రారబ్ధ కర్మలు!
వ్యాసుడు బుద్ధుడు రామకృష్ణ పరమహంస
స్వామి వివేకానంద రమణ మహర్షి
కాలజ్ఞాని బ్రహ్మం గారు
మొదలైన ఎందరో పుట్టుకతో సామాన్యులే
తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొంది
మానవాళి ప్రకృతి అభివృద్ధికి ఎంతగానో
దోహదపడినారు
అందుకే వారి యశస్సు కీర్తి ప్రతిష్టలు
చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచి పోయాయి!
మనిషిగా పుట్టినప్పుడు ధనాన్ని కాకుండా
జ్ఞానాన్ని పెంచుకోవాలి
బ్రతికిన నాలుగు కాలాలైనా హంసలా జీవించాలి
అప్పుడే యశస్సు పరిఢవిల్లుతుంది!
_ మార్గం కృష్ణ మూర్తి
No comments:
Post a Comment