Thursday, July 17, 2025

అడియేన్ దాసోహం

అంశం: *అడియేన్ దాసోహం*


శీర్శిక: అడియేన్ స్వాములకు

శ్రీ రామానుజా
శరణాగతుడను నేను నీ దాసుడను
నేను నీ సేవకుడను
సదా నీ సేవలో లీనమవుతాను
నన్ను ఆదరించు నీ సేవకుడిగా అనుమతించు
ముకుళిత హస్తాలతో అడియేన్ దాసోహం!
అని అంటారు

మరి శుభ అశుభ కార్యక్రమాలలో
కార్యక్రమం పూర్తి అయ్యాక
స్వాములందరూ కూర్చుంటారు
గోష్టి జరుగు సమయాన
అరిటాకులలో గారెలు బూరెలు సొండెలు
భోజనాలు కర్యమాదు వడ్డిస్తారు
అప్పుడు ఆ కార్యక్రమం చేసే వ్యక్తి వచ్చి
శిరస్సు వంచి "అడియేన్ స్వాములకు" 
అని అంటారు

అప్పుడు మాత్రమే స్వాములు
స్వాములు పదార్థాలను స్వీకరిస్తారు
అడియేన్ దాసోహం అని గానీ
అడియేన్ స్వాములకు అని చెప్పే వరకు
ఏమీ స్వికరించరు
అది ఒక ఆచారం నియమం సాంప్రదాయం

ఈ పద్దతి సాధారణంగాఆల్వారుల 
శ్రీవైష్ణవుల  వైష్ణవుల చాత్తాద శ్రీ వైష్ణవుల కుటుంబాలలో తప్పకుండా పాటిస్తారు

అది సహపంక్తి భోజనాలు కావచ్చు 
గోష్టి కావచ్చు భగవంతుడి పూజలు
పునస్కారాలు కావచ్చు మరేదైనా కావచ్చు
కొన్ని రకాల కార్యక్రమాలలో తప్పకుండా
అడియేన్ దాసోహం అని అంటారు

*అడియేన్* అనునది తమిళ పదం
*దాసోహం* అనునది సంస్కృత పదం

వందనం నేను సేవకుడను
లేదా నేను మీ సేవకుడను
నా కోరికను మన్నించి మేము అందించు
ఆదిత్య ములను స్వీకరించండి స్వాములారా
అనే భావన స్ఫురిస్తుంది

అడియేన్  అనేది ఒక గౌరవ ప్రదమైన పదం
భగవంతుడిని పెద్దలను గురువులను
స్వాములను పలకలహరించే టప్పుడు
వాడే పదం

తెలుగులో "నమస్కారం"  తమిళంలో 
"వణక్కం" అన్నట్లుగా గౌరవ ప్రదంగా
వాడుతారు

వైష్ణవ ఆలయాలలోని గురువులైన
శ్రీ రామానుజాచార్యులను జియర్ స్వామిని
చిన జీయర్ స్వామిని స్వాములను ఈ విధంగా సంబోధిస్తారు

అదే శ్రీ రాముడిని జై శ్రీరామ్ అని
అలానే శ్రీ కృష్ణుడిని హరే కృష్ణ అని సంబోధిస్తారు!

No comments: