Saturday, July 5, 2025

కులవృత్తి పధకాలు రావాలి

*నేటి అంశం*: చిత్ర కవిత


శీర్షిక: *కులవృత్తి పధకాలు రావాలి*

"మనుషులు చేసే వృత్తులను బట్టే కులాలు"
"కులాలను బట్టే మనుషుల జీవన విధానాలు"
"ఇవి వారికి వారసత్వంగా వస్తున్న సంపదలు"

కులాలతోని ఎవరు జన్మించ లేదనీ
వారు చేసే పనులను నైపుణ్యతను బట్టి
వాటిల్లో స్థిరపడి పోవడం వలన
కులాలు ఏర్పడ్డాయనేది జగమెరిగిన సత్యం!

బ్రాహ్మణులు క్షత్రీయులు వైశ్యులు శూద్రులు
అనేవి కూడా అలా ఏర్పడిన వర్గాలే!

కుండలు తయారు చేసే వారిని కుమ్మరులని
చెక్క పనులు చేయువారిని వడ్రంగులనీ
నగలు చేయువారిని కౌంసలి వారనీ
కల్లు దింపే వారిని గౌండ్ల వారనీ
బట్టలుతికి ఇస్త్రీ చేసే వారిని రజకులనీ
సవరం చేయువారిని నాయి బ్రాహ్మణులనీ
ఇలా అనేక వృత్తుల వారు
వారి వృత్తులను బట్టి పిలువబడుతున్నారు

కుల వృత్తులు అభివృద్ధి చెందినపుడే
మనుషులు ఆర్ధికంగా ఎదుగుతారు
మనుషులు ఎదిగి నపుడే రాష్ట్రాభివృద్ధి
రాష్ట్రాలు ఎదిగినపుడే దేశాభివృద్ధి!

ఓటు బ్యాంకు కొరకు జనాభా ప్రాతిపదికన
ఏవో కొన్ని కులాలను అభివృద్ధి చేస్తే
అది అభివృద్ధి అనబడదు
అన్ని వృత్తుల వారిని సమానంగా అభివృద్ధి చేయాలి

ఎవరి వృత్తులలో వారికి నైపుణ్యం
ఇష్టం ఆసక్తి  అభిమానం గౌరవం
అంకిత భావం ఉంటుంది, కానీ
ఏ కోశానా నాదానుతనం అయిష్టత ఉండదు
ఎందుకంటే అవి వారి వారసత్వ సంపదలు

ఎవరు చేసే పనులు వారు చేస్తేనే అందం
అవే పనులు ఇతరులు చేస్తే దుర్గంధం
ఇతరులకు ఆ పనులంటే అయిష్టత
నాదానుతనం ఉంటుంది!

పారిశుద్ధ్య కార్మికులు చేసే పనులు
పారిశుద్ధ్య కార్మికులే చేయగలరు
ఇతరులు చేయలేరు
వారిని అశ్రద్ద చేస్తే ప్రజల ఆరోగ్యాలకే హాని

కొన్ని వృత్తులను పాఠ్యాంశాలుగా చేర్చాలి
కులవృత్తులు అభివృద్ధి చెందుతేనే
కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందుతేనే
నిరుద్యోగ సమస్యలు తగ్గుతాయి
కుటుంబ జీవణప్రమాణాలు మెరుగయి
ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు!

భూములున్న భూస్వాములకే
రైతు బంధు పధకాలు కాకుండా
అన్ని రకాల వృత్తుల వారికి పధకాలను
ప్రకటిస్తూ కులవృత్తులను ప్రోత్సహించాల్సిన
బాధ్యత ఆవశ్యకత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది!

No comments: