Thursday, July 3, 2025

మనసును బట్టే క్రియలు

 *అంశం*కవితార్చన*

*మాయా లోకంలో మనసు*
శీర్షిక: *మనసును బట్టే క్రియలు*

అసలే మాయా లోకం
ఈ మాయా లోకంలో  *మనసు* చేసే
చిత్ర విచిత్రాలు వింతలు విడ్డూరాలు అనంతం
ఈ విశ్వాన్ని నడిపించేదే మనసు!

మనిషి నిమిత్తమాత్రుడు
మనిషిని నడిపించేది మనసు
మనసు సంకుచితంగా ఉంటే
మనిషి సంకుచిత బుద్దితో వ్యవహరిస్తాడు!

వయసు ఎదుగుతున్న కొద్దీ
జ్ఞానం పెరుగుతున్న కొద్దీ
అనుభవాలు గడిస్తున్న  కొలదీ
ఆటుపోట్లు ఎదురవుతున్న కొలదీ
హృదయం విశాలమవుతుంది
మనిషి మనసు వికసిస్తుంది
గొప్ప వారిగా గుర్తింప బడుతారు!

మనిషి అవయవాల వలె మనసు కనపడదు
స్పర్శకు అందనిది మాట్లాడ లేనిది మనసు

మనిషి శరీరం చరవాణి అనుకుంటే
కీపాడ్ చార్జర్ మనమిచ్చే ఇన్ పుట్స్
సూచనలు కేబుల్స్ "పంచేంద్రియాలు"
చరవాణి లోపల ఉండే పి.సి.బి.
మధర్ బోర్డ్ బ్యాటరీ, వైర్లు
మన శరీరంలోని గుండె లివర్ కిడ్నీలు
జీర్ణ ప్రక్రియలు
రామ్ రోమ్ లు మెదడుగా చెప్పవచ్చు
*సాఫ్ట్వేర్ అనేది మనసు*
రిజల్ట్ అనేది అవుట్ పుట్  "చరవాణిళ డీస్ప్లే"

మంచి మనసు గలవారికి మంచి ఆలోచనలు
చెడు మనసు గలవారికి చెడు ఆలోచనలు ఉంటాయి

*ఈ మాయా లోకంలో మనసు*
పరిస్థితులను బట్టి సంఘటనలను బట్టి
అవసరాలను బట్టి అవకాశాలనుబట్టి
సమాజం  చట్టాలలో లొసుగులను బట్టి
మనసు మారుతూ ఉంటుంది
మనసు ఎప్పుడూ నిలకడగా ఉండదు

ఋషులు మునులు యోగులు తపస్సు
చేయువారు మనసును నియంత్రణలో
పెట్టుకోగలరు వారే స్థిత ప్రజ్ఞులు

అశ కోరికలు స్వార్ధం ఈర్ష్య అసూయలు
ఆశ్రిత పక్షపాతం కలిగి యున్న మనుష్యులు
మరోపక్క పరిస్థితులు అవసరాలు ఉన్నప్పుడు
అవకాశాలు ఎదురుగా కనబడుతున్నపుడు
*మనసు* ను నియంత్రణలో పెట్టుకోవడం
అసాధ్యం
మనసును బట్టే క్రియలు ఉంటాయి 

No comments: