శీర్శిక: *ప్రతిఘటన*
నలుగురికి చెందాల్సినది
ఒకరే స్వంతం చేసుకోవాలనుకుంటే
ప్రతి ఘటన మొదలవుతుంది
ఎదురు తిరగడం ఆరంభమవుతుంది!
స్వార్ధం తీగలు పారుతే అవినీతి
కాయలు కాస్తుంది
వెంటవెంటనే ప్రతిఘటించక పోతే
ఏకులు మేకులై కూర్చుంటాయి
కాకులు పలుగాకులై తిరుగబడుతాయి!
*గెలువు గెలుస్తా* అన్నట్లుగా ఉండాలి
కానీ నేనే గెలవాలి నీవు ఏమైనా పర్వాలేదు
అని అనుకోవడం వలన
తిరుగుబాటుకు అంకురార్పణ పడుతుంది!
పెద్దన్న అన్ని దేశాల మీద అధికంగా
దిగుమతి పన్నులు వేస్తానంటున్నారు
అదే విధంగా ఇతర దేశాలు వేస్తానంటే
ఒప్పుకోనంటున్నారు
కొన్ని దేశాలతో నయాన్నో భయాన్నో
ఒప్పందం కుదుర్చుకుంటున్నారు
కొన్ని పెద్ద దేశాలు మేము మా దేశంలోకి
వచ్చే వస్తువులపై మేమూ అధిక దిగుమతి పన్నులు వేస్తామంటూ ప్రతిఘటిస్తున్నాయి
ఒప్పందం చేసుకోకుండా మొండికేస్తున్నాయి!
పిల్లలు వారికి లోకజ్ఞానం వచ్చాక
నచ్చని విషయాలు వారిపై ఎవరు రుద్దినా
వారు తల్లిదండ్రులనైనా గురువులనైనా
మరెవరినైనా ఎదిరిస్తారు
వ్యతిరేకిస్తారు ప్రతిఘటిస్తారు!
నాయకులు ఎన్నికలలో గెలిచి
ప్రజారంజకంగా కాకుండా
ప్రజా కంఠకంగా పాలించితే
రాష్ట్ర సంపదలను కూలగొడుతుంటే
ప్రజలు తిరుగుబాటు కేతనం ఎగురవేస్తారు!
బార్డర్ లో భారతీయ సైనికులను
ఇతర ఏ దేశస్తుల సైనికులు కవ్విస్తే
తక్షణమే ప్రతిఘటిస్తారు మల్లీ లేవకుండా
ఆపరేషన్ సిందూర్ లా క్షణాలలో
దెబ్బకు దెబ్బ చావు దెబ్బ కొడుతారు!
మనిషిగా పుట్టినప్పుడు ఇష్టం కాని
సంఘటనలు జరుగుతున్నపుడు
మొదట అర్ధం చేసుకోవాలి
తరువాత ఎదుటి వారిని ప్రశ్నించాలి
ప్రతిఘటించాలి ఎదురుతిరగాలి
సాధించుకోవాలి
కానీ మేకలా తలూపుకుంటూ
బానిసత్వంతో ఉండకూడదు
ప్రతిఘటన మనిషి మౌళిక హక్కు
హక్కులను హరిస్తే అనిచివేస్తే తిరుగుబాటే!
No comments:
Post a Comment