Friday, July 11, 2025

స్వేచ్చా అంటే నీదేనోయ్

 శీర్షిక: *స్వేచ్ఛంటే నీదేనోయ్!*


స్వేచ్ఛంటే నీదేనోయ్ 
నీ యిష్టంగా బ్రతకడమే స్వేచ్ఛనోయ్
ఆకాశమే నీకు హద్దు
అవని నీకు ముద్దు
దున్నపోతైతే ఏమి
అది నీ ఐరావతం
విశ్వమే నీది కదా
సూర్య చంద్రులు నీకు కాపలా
కక్షలు కార్పణ్యాలు నీకు లేవు
అహాలు ద్వేషాలు తెలియవునీకు
కోరికలంటూ నీకు లేవు
నీకున్నది ఒకటే 
ప్రకృతిని ఆస్వాదించడము
ఆనందంగా జీవించడము
స్వేచ్ఛంటే నీదేనోయ్
నీ ఇష్టంగా బ్రతకడమే స్వేచ్ఛనోయ్!

No comments: