Saturday, July 5, 2025

బద్దకం ఒక బలహీనత

అంశం: బద్దకం మనిషికి శత్రువు

శీర్శిక: *బద్దకం ఒక బలహీనత*

వయసుతో నిమిత్తం లేకుండా
ప్రతి మనిషి  ప్రతి నిమిషం
ఎదో ఒక  వ్యాపకంతో ఉండాలి
లేదంటే ఆవహించు బద్దకం
బద్దకం మనిషికి శత్రువు!

పాఠించు నిత్యం ఒక క్రమ శిక్షణను
ఎప్పుడూ దరి చేరదు నీలో బద్దకం
ఆమడదూరంలో ఉంటుంది అలసత్వం
ఉండును మనసు ఉల్లాసం తేజోవంతం!

సమయం క్రమశిక్షణ ఎంతో విలువైనవి
ఏ సమయంలో చేయాల్సిన పనులు
ఆసమయంలో చేయాలి లేదంటే
అవి మనల్ని నూరేళ్ళు వెనక్కి నెట్టు!

ఎంట్రెన్స్ పరీక్షకు నిమిషం ఆలస్యమయినా
ఒక సంవత్సర కాలం వృధా అవుతుంది
ఆ పిదప ఆసక్తి కలుగవచ్చు కలుగకపోవచ్చు
ఉత్సాహం లేనట్లైతే జీవిత కాలం వృధా!

మనసు వేరు బుద్ధి వేరు 
మనసు చంచలమైనది బుద్ధి స్థిరమైనది
మనసు మనిషి లోని భావోద్వేగాలను
ఆలోచనలను కరుణ దయను సూచిస్తే
బుద్ధి తెలివిని విచక్షణా జ్ఞానాన్ని సూచించు!

ఏ పనీ పాటా లేకుండా తిని కూర్చున్నా
లేదా పడుకున్నా అదేపనిగా టివిలో
చరవాణిలో అనవసరమైనవి చూస్తున్నా
బుద్ధి అనేది బద్దకానికి బందీగా మారి
మనిషిలో సోమరి తనం పెరిగి
రేపు ఏ పనీ చేయడానికి ఇష్టం ఉండదు!

ఒక్కో సారి అనారోగ్యం కారణంగానూ
జీవితంపై విరక్తి కలగడం వలననూ
బద్దకం ఆవహించి బుద్ధి నశిస్తుంది
ప్రాణం, కాలం విలువైనవని తెలుసుకొని
బద్దకాన్ని దూరం చేస్తే జ్ఞానులవుతారు
లేదంటే అజ్ఞానులవుతారు!

బుద్ధి లోపించడం వలన కుటుంబంలో
సమాజంలో గౌరవం సన్న గిల్లు
బద్దకం సోమరి తనం బుద్ధికి బద్దశత్రువులు
మనిషి ఎదుగుదలకు అడ్డుగోడలు
కష్టమైనా వాటిని తక్షణమే తొలిగించాలి!

సైకాలజీ ప్రకారం *బద్దకం* ఒక *బలహీనత*
బుద్ధి ఎప్పుడూ చురుకుదనంతో ఉండాలి
చెడు ఆలోచనలకు స్వస్తి పలకాలి
మంచి బుద్ధితో వర్తమానంలో జీవించాలి
సమాజంలో గొప్ప గుర్తింపు పొందాలి! 

No comments: